మునుగోడు ముంచెత్త‌నున్న ప్ర‌చార హోరు

మునుగోడు అన్ని రాజ‌కీయ‌పార్టీల రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగా మారిన స‌మ‌యం. ఇక్క‌డ ఉప ఎన్నిక‌ ల‌కు పార్టీలు స‌మా య‌త్త‌మ‌వుతు న్నయి. ఈ నెల 20 న ల‌క్ష‌మందితో మునుగోడు ప్ర‌జా దీవెన పేరుతో టీఆర్ ఎస్ మ‌హాస‌భ నిర్వ‌హిం చ‌నుంది. దీని కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌చార ర‌థాలూ రూపొందించారు. అవి మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చేరాయి. సీఎం కేసీఆర్‌ ఫొటోతో గులాబీ రథాలు గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక ఎన్నిక అయినం దున.. ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తాను కొంతదూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌.. మరోసారి దానిని పునరావృతం కానివ్వొద్దని పట్టుదలతో ఉన్నా రు. ఇందుకోసం అసంతృప్తులను బుజ్జగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నింట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లా ర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.

కాగా, మునుగోడు మండలానికి మంత్రి జగదీష్‌ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నారాయణపురానికి గాదరి కిషోర్‌, గొంగిడి సునీత, చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి నల్ల మోతు భాస్కర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్య, చౌటుప్పల్‌ రూరల్ కు శానం పూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, మర్రిగూడ మండలానికి పైళ్ల శేఖర్‌రెడ్డి, నాంపల్లి మండలానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ నాయక్‌, చండూరు మునిసి పాలిటీకి చిరుమర్తి లింగయ్య, చండూరు రూరల్‌ నోముల భగత్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్ రెడ్డికి బాధ్యతలు అప్పగిం చారు. బహిరంగ సభ 20న మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమీపం లోని 40 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్‌చార్జి ఎమ్మె ల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్‌రావుకు, సభ ఏర్పాట్ల బాధ్యతను గాదరి  బాలమల్లుకు అప్పగించారు. మండలాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు శని వారం(ఆగ‌ష్టు13) నుంచే పని ప్రారంభించా రు. చౌటుప్పల్‌ ముని సిపాలిటీ, రూరల్‌ మండలాల బాధ్యతలు చేపట్టిన ఎమ్మె ల్యేలు స్థానిక నేతలతో సమావేశమయ్యారు. 

చండూరులో నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం సభను విజయ వంతం చేయాలని, పార్టీ అభ్యర్థి గా ఎవరిని ప్రకటించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని, చిన్నచిన్న సమస్యలుంటే ఎన్నికల తర్వాత కూర్చోని పరిష్క రించుకుందామంటూ మండల సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు సందేశం ఇచ్చారు. అధికార పార్టీ నుంచి  టికెట్  ఆశిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణా రెడ్డిని సీఎం కేసీఆర్‌ శని వారం ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. అభ్యర్థి ఎవరనేది సర్వేలు చేయించాం, మీకు మునుగోడులో మంచి పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన వారిని పిలవకుండా మిమ్ముల్నే పిలిచి మాట్లాడడంలో ఆంతర్యం గ్రహించి జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి ప‌నిచేయాల‌ని సీఎం చెప్పినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పాదయాత్ర ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా డీసీసీ అధ్యక్షుడు అనీల్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజులు గా పాదయాత్ర చేస్తు న్నారు.  

కాగా, ఈనెల  16 నుంచి మండలాల వారీగా సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాలకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి ప్రక టించారు. తాజాగా ఆయనకు అనారోగ్యంతో షెడ్యూల్‌ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సిందే. అదేవిధంగా అభ్యర్థి విషయం లో పోటీలో ఉన్న నేతలతో సంప్రదింపుల విషయం సైతం వాయిదా పడింది. ఇక మునుగోడు వైపు వెళ్లేది లేదని ఎంపీ వెంకట్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి 16న సమావేశాలకు హాజరు విష‌యం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. 

అయితే, మాటల తూటాలు పేలుస్తున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో ఈనెల 21న చేరేందుకు నిర్ణయించుకోవడం, అదేరోజు మును గోడులో అమిత్‌షా సభ, భారీగా చేరికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీ మండలంలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ వారితో కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ లపై ప్రజాప్రతినిధుల సమక్షంలో భారీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజకీయంగా ఎదు ర్కోలేకే  తనపై  కుట్రలు చేస్తు న్నారని, అమ్ముడు పోయినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అభివృద్ధి కోసమే రాజీ నామా చేశానని,  రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్‌షాతోనే సాధ్య మని, మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తార‌నీ ఆయన ప్రచారం చేస్తున్నారు.

బరిలో పలు పార్టీలు ఉప ఎన్నిక నేపథ్యంలో పోటీ విషయమై సీపీఎం నేతలు వరుసగా రెండుసార్లు చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించారు. సీపీఐ నేతలు చండూరులో శుక్రవారం(ఆగ‌ష్టు 12) సమావేశం నిర్వహించారు. సీపీఐ బరిలో ఉంటే సీపీఎం మద్దతివ్వడం, వామపక్షాలు ఐక్యంగా ఒక అభ్యర్థిని ఖరారు చేయాలని ప్రా థమికంగా నిర్ణయించారు. బీజేపీ మొదటి స్థానానికి వెళ్లే పరిస్థితి ఉంటే టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. బీఎస్పీ ఎన్నిక బరిలో ఉంటుందని ప్రవీణ్ కుమార్‌ ప్రకటించగా, గోడలపై ప్రచార రాతలు సైతం ప్రారంభించారు. అదే విధంగా పోటీలో ఉంటామని ప్రజాశాంతి పార్టీ అధ్య క్షుడు కేఏపాల్‌, దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారధన్‌ మహారాజ్‌ ప్రకటించారు.