నితీష్ కొత్త కేబినెట్ లో కీలక పదవులన్నీ ఆర్జేడీకే?

ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీష్ మహాఘట్ బంధన్ లో చేరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మహాఘట్ బంధన్ లో పెద్ద పార్టీ ఆర్జేడీయే అన్న సంగతి విదితమే. ఆర్జేడీ నేత తేజస్వి కుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక కొత్త కేబినెట్ కూర్పులో అత్యధిక మంత్రి పదవులూ, అందులోనూ కీలక శాఖలూ నితీష్ కుమార్ ఆర్జేడీకే కట్టబెట్టే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో మిగిలిన పార్టీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉండటంతో నితీష్ కుమార్ తన మంత్రివర్గంలో గత ఎన్డీయే కేబినెట్ లో ఉన్న జేడీయూ మంత్రులకు స్థానం కల్పించనున్నారు. అంటే నీతీష్ కొత్త కొలువులో వారికి స్థానం కల్పించబోతున్నారు. అంటే 12 నుంచి 13 మంది జేడీయూ సభ్యులకు నితీష్ క్యాబినెట్ లో స్థానం లభిస్తుంది. అలాగే నాలుగు కేబినెట్ పోస్టులు కాంగ్రెస్ కు ఇస్తారు. మరో ఒకటి రెండు పోస్టులు ఇతర పార్టీలకు దక్కే అవకాశం ఉండగా మిగిలినవన్నీ

అంటే 18 నుంచి 19 మంత్రి పదవులు ఆర్జేడీ సభ్యులకు లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా కీలకమైన హోం, ఆర్థిక శాఖలు ఆర్జేడీకే దక్కే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి వరకూ రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న ఆర్జేడీ ఈ రోజు (ఆగస్టు 10) నుంచి అధికార పక్షంగా మారిపోయింది.