ఉద్యోగాలను కాపాడిన ఏఐ.!
Published on: Sat Aug 29, 2026 10:48AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరుగుతున్న కొద్దీ ఐటీ రంగంలో ఉద్యోగాలు గల్లంతవుతాయనే భయాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ భయాలకు తగ్గట్టుగానే ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ సంస్థలు. వ్యయ నియంత్రణ పేరిట పెద్ద ఎత్తున రిట్రెంచ్ మెంట్లు చేస్తున్నాయి. ఏఐ వినియోగంతో మానవ వనరులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ రంగంలో ఇప్పటికే వేల సంఖ్యలో ఐటీ నిపుణులు నిరుద్యోగులుగా మారారు.
అయితే.. ఆశ్యర్యకరంగా అనూహ్యంగా ఓ ఐటీ సంస్థలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోకుండా అదే ఏఐ కాపాడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగాలలో కోత విధించి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాలని నిర్ణయానికి వచ్చిన సదరు కంపెనీ యాజమాన్యానికి ఏఐ హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులను తొలగిస్తే.. కంపెనీ మనుగడకే ముప్పు అని విస్పష్టంగా చెప్పింది. ఏ ఏఐని అయితే నమ్ముకుని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుదామని ఆ కంపెనీ యాజమాన్యం భావించిందో, అదే ఏఐ టూల్ ఉద్యోగల తొలగింపు కంపెనీ భవిష్యత్ కు ముప్పుగా మారుతుందని హెచ్చరించడంలో సదరు కంపెనీ యాజమాన్యం లేఆఫ్స్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఇంతకీ ఆ కంపెనీ ఏమిటంటే.. సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా కార్పొరేషన్. సంస్థలోని వివిధ విభాగాలు, టీమ్‌లలో దాదాపు 60 శాతం మేర ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించాలని మెటా కార్పొరేషన్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఏఐ ద్వారానే పనులు వేగంగా సాగుతుండటంతో ఉద్యోగుల కోతతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని యాజమాన్యం భావించింది. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించే ముందు, ఏఐ సిస్టమ్‌కే బాధ్యతలు అప్పగించి తుది అభిప్రాయాన్ని కోరింది. అయితే.. కంపెనీ నివేదికను అనలైజ్ చేసిన ఏఐ టూల్.. మెటా కార్పొరేషన్ యాజమాన్యానికి నోట మాట లేకుండా చేసింది.
సంస్థ నుంచి సిబ్బందిని తొలగించవద్దని, ఆ నిర్ణయం కంపెనీ మనుగడకే ప్రమాదకరమని కుండబద్దలు కొన్నినట్లు పేర్కొంది. కేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తే మిగిలి స్టాఫ్ లో అసంతృప్తి, మానసిక ఒత్తిడి పెరిగి పనితీరు దెబ్బతింటుందనీ, అదే సమయంలో కంపెనీ ప్రతిష్ట మసకబారుతుందనీ ఏఐ పేర్కొంది. అంతే కాకుండా, ప్రాక్టికల్ సమస్యలను కూడా ఏఐ విపులంగా పేర్కొంది. ముందుముందు ఏఐ పనితీరులో సాంకేతిక లోపాలు తలెత్తితే.. వాటిని సరిదిద్దడానికి ఎక్స్ పీరియెన్స్ డ్ స్టాఫ్ అవసరమని స్పష్టం చేసింది.
వాస్తవానికి మెటా ఇప్పటికే రెండు విడతల్లో భారీగా ఉద్యోగాల కోతకు నిర్ణయించుకుని ఇప్పటికే టోటల్ వర్క్ ఫోర్సులో పది శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇక మరో రెండు నెలల్లో రెండో విడతలో మరింత భారీ ఉద్వాసనకు ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ రెండో ఈ రెండో విడత లేఆఫ్స్ ను ఏఐ అడ్డుకుంది. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగుల తొలగింపు ప్రతిపాదనను పక్కనబెట్టినట్లు ప్రకటించారు.
{AI Stopped Meta Layoffs, Artificial Intelligence Job Save, Mark Zuckerberg, Meta Employee Layoffs, Tech Industry, Telugu One}


