నాకు అతనితో లింకు కొనసాగుతోంది....
posted on Dec 30, 2014 3:43PM

‘స్కైఫాల్’ అనే అల్బమ్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సింగర్, నటి అడేలీకి మరో కళాకారుడు సిమన్ కొనెస్కీతో చాలాకాలంగా ‘అనుబంధం’ కొనసాగుతూ వస్తోంది. మహా అందగత్తె అయిన అడేలీ మీదే అందరి కళ్ళూ... అలాంటి అందగత్తెతో ‘స్నేహం’ పొందిన సిమెన్ కొనస్కీ అంటే అందరికీ కుళ్ళూ...! ఇదిలా వుంటే ఇటీవలి కాలంలో అడేలీకి, కొనస్కీకి మధ్య చెడిందన్న రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎక్కడా కలసి కనిపించకపోవడంతో వీరి బంధం తెగిపోయిందన్న రూమర్లకు బలం చేకూరింది. ఇప్పుడిక అడేలీ ఎవరితో స్నేహం చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూసేవారు కొందరయితే, ఆ ‘స్నేహం’ ఏదో తనకే దొరికితే ఎంత బాగుంటుందో అనుకునేవారు మరికొందరు. ఈ ఆసక్తులు, ఆశలు ఇలా వుండగానే, అందరికీ షాకిస్తూ అడేలీ ఒక ట్విట్ చేసింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నాకు, కొనెస్కీకి కటీఫ్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ మా ఇద్దరి మధ్య స్నేహానికి ఏమీ కాలేదు.. మా ఇద్దరి మధ్య లింకు సుబ్బరంగా కొనసాగుతోంది’ అని కూడా ట్విట్ చేసింది.