Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోడీకి డిగ్రీ సర్టిఫికెట్ వర్సెస్.. అభిజీత్ దీప్కే స్కాలర్ షిప్ పేపర్స్.!
posted on: Aug 4, 2026 3:01PM

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నీట్ పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యువ నాయకుడి విదేశీ విద్యానిధులపై బీజేపీ, దాని మద్దతు దారులు ప్రశ్నలు కురిపిస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభిజీత్ దిప్కేను పాకిస్తానీ ఏజెంట్ అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేయాలనే డిమాండ్లు కూడా వెలువడ్డాయి.
కాగా తనపై వస్తున్న ఆరోపణలు, విచారణ డిమాండ్లపై అభిజీత్ దిప్కే స్పందించారు. ఈ విషయంలో ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ద్వారా అభిజీత్ దీప్కే.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు బోస్టన్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే ఈ ప్రభుత్వానికి అంత కడుపుమంట ఎందుకని నిలదీశారు. తన విద్యార్హతలూ, ఆర్థిక లావాదేవీలలో ఎటువంటి దాపరికంలేనన్న అభిజీత్ దిప్కే.. తాను పొందిన స్కాలర్‌షిప్ పత్రాలు, విద్యారుణం మంజూరు లేఖలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్‌ను దేశ ప్రజలకు చూపిస్తారా? అంటూ సవాల్ చేశారు.
ఈ వివాదంలో అభిజీత్ దిప్కే తన విద్యాభ్యాసం, దానికి అయిన ఖర్చులకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ పూర్తి చేసిన ఆయన, జూన్ నెలలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన చదువు కోసం బోస్టన్ విశ్వవిద్యాలయం ప్రతీ సెమిస్టర్‌కు 12,వేల 500 డాలర్ల చొప్పున మొత్తం 3 సెమిస్టర్లకు 37 వేల500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 31 లక్షలకు పైగా) డీన్స్ స్కాలర్‌షిప్ మంజూరు చేసిందని దీప్కే వివరించారు. ఇక మిగిలిన విద్యా వ్యయం కోసం బ్యాంకు నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానని, ఆ అప్పును తాను ఇప్పటికీ వాయిదాల పద్ధతిలో తీరుస్తున్నానని వెల్లడించారు.తప అర్హత, ప్రతిభ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్ లభించిందన్న ఆయన ఈ విషయంలో కావాలంటే దర్యాప్తు చేసుకోవచ్చన్నారు.
ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వెంటనే ఈడీ (ఈడీ), సీబీఐవంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం పరిపాటిగా మారిందన్న అభిజీత్ దిప్కే.. ప్రధాని నరేంద్ర మోదీ తన ఇంటికి ఈడీని పంపినా తనకు అభ్యంతరం లేదనీ, దర్యాప్తు కోసం వచ్చే అధికారుల చేతికి మోడీ.. తన డిగ్రీ సర్టిఫికేట్ కాపీని ఇచ్చి పంపాన్నారు. అప్పుడే నేను నా లోన్ పేపర్లు, స్కాలర్‌షిప్ లెటర్లు, డిగ్రీ కాపీలను అధికారులకు అందిస్తానని చెప్పారు.
Abhijeet Dipke, Narendra Modi Degree, Cockroach Janta Party, Boston University Scholarship, CJP Youth Movement, Education Loan Row






