భర్తకు హ్యాండ్.. బాయ్ ఫ్రెండ్ కి గోల్డ్.. 

ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త చాలా మంచి వాడు. ఆర్థికంగా  వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మన ఇంట్లో కోడి కూర కంటే పక్కింటి పాసిన  కూరే రుచి అన్నట్లు. మొగుడు ఉండగానే ఆ మహిళ పరాయి మగాడి  మోజులో పడింది. తన భర్తకు  తెలియకుండా ఎదావిదిగా వివాహేతర సంబందానికి తెర లేపింది. అయితే భర్త ఇంట్లో ఉన్న టైంలో ప్రియుడితో రాసలీలలు నడపడం కష్టం అవుతుంది. రోజు అలాగే జరగడంతో ఇబ్బందిగా మారడంతో ప్రియుడి ఎడబాటు తట్టుకోలేకపోయింది ఆ కామ ప్రియురాలు.ఇలా ఐతే కాదని చివరికి ప్రియుడితో ఎక్కడికైనా ఎగిరిపోవాలనుకుంది. ఆమె అనుకున్నట్లు గానే ఆ విషయం ప్రియుడితో పంచుకుంది. ఆ మాటకు ఆమె ప్రియుడు తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. ఇక అంతే ప్రియుడితో కలిసి సొంతింటికే కన్నంవేయాలని చూసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నారా..? ఆ ప్రియురాలు తన ప్రియుడితో ఎగిరిపోయిందా..? లేదా వాళ్ళ పధకం ఏమైంది అని తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి.. 

వివరాల్లోకి వెళ్తే.. అది అనంతపురం జిల్లా. తాడిపత్రిపట్టణంలోని నంద్యాల రోడ్డు. ఆ రోడ్డు సమీపంలో ఉన్న హజీవలీ, షాజహాన్ సోదరులు నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఏడాది మే 22న వారి ఇళ్లల్లో రూ. 7.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా తాడిపత్రి రూరల్ పోలీసులు రంగంలోకి దిగి కేసు చేసి. దర్యాప్తు చేపట్టారు. షాజహాన్‌కు షాహీనాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అక్కడితో సంతోషపడక సాహీనా మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అదే గ్రామానికి చెందిన బాలబ్రహ్మయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండా షాహీనా బాలబ్రహ్మయ్యతో తరచూ కలిసేది. వాళ్ళ ప్రేమ అనే చీకటి మాటున హద్దులు కూడా దాటేవాళ్ళు  అయితే భర్త ఇంటి దగ్గర ఉన్న సమయంలో కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో ఇద్దరూ ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్‌లో జీవించేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు షాహీనా మాస్టర్ ప్లాన్ వేసింది. మే 22న తన ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు పొరుగున ఉన్న బావ ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి బ్రహ్మయ్యకు అందచేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు మహా నటి పాత్ర పోషించింది.. 

అనంతరం మే 28న కుమార్తెతో కలిసి తన ప్రియుడితో అనుకున్నట్లుగానే షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ..షాజహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాహీనాపై అనుమానం వచ్చింది. వారి మెుబైల్ ఫోన్‌ను ట్రాప్ చేశారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. తామే చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. వీరి దగ్గర నుంచి 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుందని అంచనా. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు.