50 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. బండి సంజ‌య్‌

ఎదుటివారిని భ‌యాందోళ‌న‌కు గురిచేయ‌డానికి అనేక వ్యూహాలు అనుస‌రిస్తారు. రాజ‌కీయాల్లోనూ అంత‌కు మించే జ‌రుగుతుంటుంది. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, ప్ర‌చారాలు చేయ‌డంలో ఇటీవ‌ల బీజేపీ వారిని మించిన‌వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. తెలంగాణాలో ఎలా గైనా అధికారంలోకి రావాలన్న ఆతృత‌తో టీఆర్ ఎస్‌కు జంప్ జిలానీల సంఖ్య పెంచుతూ తెలంగాణా బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ లెక్క‌ను పెంచుతూ పోతున్నారు. టీఆర్ ఎస్ నుంచి ఏకంగా 50మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ నీడ‌లోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్నారని సంజ‌య్ అన్నారు. 

జ‌నాక‌ర్ష‌ణ వ‌దిలేసి ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలోనే బండి బాగా ఆస‌క్తి చూపుతున్నారు. దీనికి తోడు టీఆర్ ఎస్ ని చిన్న‌పిల్ల‌ల్ని భ‌య‌పెట్టిన‌ట్టు హెచ్చ‌రిక‌లు చేయ‌డంలో బాగా ప్రావీణ్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ బొమ్మతో ఎన్ని క ల్లోకి వెళితే గెలవలేమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, ఆ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్‌ తెలిపారు. 

గతంలో 12 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌కటించిన బండి ఇపుడు ఆ సంఖ్య‌ను ఏకంగా 50 కి పెంచారు. మూడో విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ఉత్సాహంతో ఆయ‌న అలా ఆ సంఖ్య పెంచుతూ పోతున్నార‌న్న అనుమానం అంద‌రికీ రాక పోదు. జ‌నాన్ని చూస్తే వెర్రెక్కిపోవ‌డంలా ఈ యాత్ర‌లో సంజ‌యునికి జ‌నాన్ని చూడ‌గానే వారికి లెక్క పెంచి చెబితే పార్టీ ఎంత శ‌క్తి వంతంగా ముంద‌డుగు వేస్తోందో వారికి తెలియ‌జేయాల‌న్నఆలోచ‌నా అందులో ఉంది. యాత్ర 11వ రోజు శనివారం (ఆగ‌ష్టు 13)యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కొనసాగింది. పొడిచేడు గ్రామంలో మలి ఉద్యమంలో తొలి అమ రుడైన కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

మోత్కూరు అంబేడ్కర్‌ చౌరస్తాలో సంజయ్‌ మాట్లా డుతూ, ఉప ఎన్నిక రావాలన్నది కేసీఆర్‌ కోరిక అని, మునుగోడులో టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఏకమై వచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్‌ ఇంట్లో కొడుకు, బిడ్డ, అల్లుడి మధ్య లొల్లి మొదలైందని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నయా నిజాం పాలన సాగుతోందని, ప్రజలు తమ ఆకాంక్షల సాధనకు మరోసారి పోరాడా లని, ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి తమ పార్టీ ఉద్యమిస్తోందని, మేధావులు, కళాకారులు, అన్నివర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని ఆయన కోరారు.