లేపేస్తే 50 లక్షలు.. క‌మ్మ కులంలో చీడ‌పురుగులు.. ప‌రిటాల బ‌తికుంటేనా..

కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అంబ‌టి రాంబాబు. ఈ ముగ్గురు వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలుగుజాతి అంతా అస‌హ్యించుకుంటోంది. తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. నోటికొచ్చిన‌ట్టు కారుకూత‌లు కూసిన వారిపై.. ప్రాంతాలు, పార్టీల‌కు అతీతంగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా, మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిలర్ మల్లాది వాసు మ‌రింత‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కొడాలి నాని, వల్లభనేని వంశీలు కమ్మ కులంలో చీడపురుగుల్లా పుట్టారని మండిప‌డ్డారు. వాళ్లిద్దరితో పాటు మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబును భౌతికంగా లేకుండా చేసేందుకు తాను రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని మల్లాడి వాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

కమ్మ కులానికి అండగా ఉన్న పరిటాల రవిని భౌతికంగా నిర్మూలించడానికి అప్పట్లో కొందరు మొద్ద శీనును వాడుకుని ఆపరేషన్ చేశారని చెప్పారు. పరిటాల బతికి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని మల్లాది వాసు అభిప్రాయ‌ప‌డ్డారు.

Related Segment News