పెట్రోల్, డిజీల్‌ ఫ్రీ 

కరోనా వల్ల చాలా మంది ప్రాణాలు కోపోతున్నారు.. ఇంకా చాలా మంది ఉద్యోగాలను కోలుపోతున్నారు. వ్యాపారాల్లో నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇంకా సామాన్యుడి జీవితం కుక్కలు చింపిన విస్తరాకు కంటే దారుణంగా తయారు అయింది. ప్రజలను ఆర్థికంగా అడుగంటి పోతున్నారు. చేద్దామంటే పని, తిందాం అంటే తిండి లేదు. ఇక  నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. అదేదో సినిమాలో ఏం కొనేటట్లు ఏం తినేటట్లు నాగులో నాగన్న ధరలిట్లా పెరుగబట్టే నాగులో నాగన్న అనే పాట గుర్తుకు వస్తుంది.  కొద్దీ సేపు ఆ విషయాన్నీ పక్కన పెడితే. మరో వైపు దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సచిన్ కొట్టే సెంచురీ దాటింది. దీంతో వాహనదారులు పెట్రోల్ కొట్టించాలంటేనే హడలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఉచితంగా పెట్రోల్ పోస్తారా? అయితే, ఓ పెట్రోల్ బంకులో మాత్రం పెట్రోల్‌ను ఉచితంగా కొట్టారు. ఏకంగా మూడు లీటర్ల ఇంధనాన్ని దానిమిచ్చేశారు.

‘‘ఆ పెట్రోల్ బంక్ ఎక్కడో చెప్పండి.. మేము కూడా వెళ్లి ట్యాంకులు నింపేసుకుంటాం’’ అని అంటున్నారా? అయితే, కష్టమే. ఎందుకంటే 50 రూపాయల పెట్రోల్ కొట్టించుకోవడానికి 150 కిలోమీటర్లు వెళ్లినట్టు ఉంటది. ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లాలంటే. ఎందుకంటే  ఆ పెట్రోల్ బంకు కేరళలో ఉంది. పైగా, వారు ఆటోరిక్షాలకు మాత్రమే ఉచితంగా పెట్రోల్ పోస్తున్నారు. అంత ఖరీదైన పెట్రోల్‌ను ఉచితంగా ఎందుకు ఇస్తున్నారనేగా మీ తర్వాతి సందేహం? ఇందుకు ఓ కారణం ఉంది.

కసరగాడ్‌లో జంక్షన్ లో పెట్రోల్ బంకులో సోమవారం ఆటోరిక్షాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ దానమిచ్చారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత వచ్చిన అన్ని ఆటోలకు కాదనకుండా మూడు లీటర్ల చొప్పున ఇంధనాన్ని ఫిల్ చేశారు. సరద్కాకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గల స్టేట్ హైవేలో పెర్లా ప్రాంతంలో ఈ పెట్రోల్ బంక్ ఉంది. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ మేనేజర్ సిద్దీక్ మదుమూలే మాట్లాడుతూ.. ‘‘ఆటోరిక్షాల కోసం పెట్రోల్ తరఫున సుమారు రూ.లక్షల విలువ చేసే ఇంధనాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు వచ్చిన మొత్తం 313 ఆటో రిక్షాలకు ఉచితంగా పెట్రోల్ కొట్టాం. ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.97.70, డీజిల్ రూ.93.11 ఉంది’’ అని తెలిపారు.

పెరిగిన ఇంధన ధరలతోపాటు లాక్‌డౌన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఆటోరిక్షా డ్రైవర్లకు కాస్త ఉపశమనం కలిగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సిద్దీక్ తెలిపారు. ఇది కేవలం సాయం కోసం చేసిన దానమే గానీ, వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో కాదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నీర్చాల్ అనే ఆటోడ్రైవర్ స్పందిస్తూ.. ‘‘నా 37 ఏళ్ల జీవితంలో ఏ పెట్రోల్ బంకు ఇలా ఉచితంగా ఇంధనం దానం చేయలేదు. ఇక్కడ డీజిల్ కొట్టించుకొనేందుకు సుమారు ఒక లీటర్ డీజిల్ ఖర్చయింది. ఇందుకు ప్రతిగా రెండు లీటర్ల డీజిల్ ఉచితంగా లభించినందుకు సంతోషంగా ఉంది’’ అని తెలిపాడు. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్‌లను ఉచితంగా అందించడమంటే గ్రేటే కదూ.

కేరళ రాష్ట్రము మన దేశంలోనే రోల్ మోడల్ అని చెప్పొచ్చు.. ఎందుకంటే అక్కడి ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ అయిన.. మనం అలాంటి వాటిని ఆదర్శంగా తీసుకోము ఎందుకంటే.. అలాంటి రాష్ట్రాలను ఆదర్శం తీసుకుంటే మన దేశం బాగుపడుతుంది.. అందరూ చదువుకుంటారు. రాజకీయం, విద్య, ఉద్యోగం అందరికి సమానం అయితే , మన దేశంలో కొంతమందికి బతుకు దెరువు ఉండదు అందుకే మనల్ని అలాంటి ఆలోచనలు కూడా చేయకుండా డైవట్ చేస్తుంటారు.