25 మంది కరోనా రోగులు పరార్

25 మంది కరోనా రోగులు తప్పించుకుని వెళ్లారు. కేవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగులు... అర్ధరాత్రి సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. కరోనా రోగులు పారిపోయారన్న వార్తలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పారిపోయిన కొవిడ్ రోగుల కోసం స్థానిక అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు. త్రిపుర రాష్ట్రంలోని అంబస్సాలో ఈ ఘటన జరిగింది. 

త్రిపుర రాష్ట్రంలోని అంబస్సా పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ భవనంలో తాత్కాలికంగా కొవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉంచారు. వంద మందికి వరకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ సెంటర్ నుంటే 25 మంది కరోనా రోగులు పారిపోయారు. కరోనా రోగులు పారిపోయారన్న సమాచారంతో స్థానికంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. పారిపోయిన కొవిడ్ రోగుల కోసం పోలీసులు గాలించగా వారిలో ఏడుగురిని రైల్వేస్టేషనులో పట్టుకున్నారు. మరో 18 మంది కరోనా రోగులు రైలు ఎక్కి త్రిపుర రాష్ట్రం విడిచి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఏప్రిల్ నెల 22వతేదీన 31 వతేదీన అగర్తలాలోని అరుంధతీనగర్ కొవిడ్ కేర్ సెంటరు నుంచి కరోనా రోగులు తప్పించుకొని పారిపోయారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ లో నియమకాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడటంతో కొవిడ్ కేర్ కేంద్రంలో చేర్చగా పారిపోయారు.పారిపోయిన వారిని ఇంకా గుర్తించలేదు. దీంతో తమ రాష్ట్రానికి వచ్చే వారందరూ కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని త్రిపుర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Segment News