మంచు విష్ణు కన్నప్పకు సినిమా కష్టాలు!

మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కన్పప్ప సినిమాకు సినిమా కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కన్నప్పలో కీలక సన్నివేశాల హార్డ్ డిస్క్ చోరీకి గురైంది. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ విషయంలోనూ ఇబ్బందుకు ఎదురౌతున్నాయి. కన్నప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ 13 సన్నివేశాలను తొలగించాల్సిందేనంటూ రివిజన్ కమిటీ నివేదిక ఇచ్చింది. సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరచడం, పిలక, గిలక పాత్రలతో ఒక సామాజిక వర్గాన్ని, దేవీ, దేవతలను, కోయకులాన్ని కించపరిచే విధంగా ఉన్న 12 సన్నివేశాలను తొలగించాల్సిందేనని 11 మంది సభ్యులతో కూ డిన రివిజన్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మేరకు ఆ 13 సన్నివేశాలను తొలగించిన సినిమా కాపీ వచ్చిన తరువాతే కన్నప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని రీజనల్ సెన్సార్ ఆఫీసర్ పేర్కొన్నారు. 

 కన్నప్ప సినిమా పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్  దాఖలైన సంగతి తెలిసిందే.  ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్ , సినీమా నిర్మాత మంచు మోహన్ బాబు నటులు మంచు విష్ణు బ్రహ్మానందం, సప్తగిరి వాదనలు వినిపించాల్సి ఉంది. కన్నప్ప  సినిమా విషయంలో తొలి నుంచీ సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయానికించపరచడం దేవీ దేవతలను కించపరచడం సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.