పిల్లల్ని కనే తీరిక లేదు: విద్యాబాలన్
posted on Jun 23, 2014 5:33PM
.jpg)
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌కి నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో పెళ్ళయి రెండేళ్ళవుతుంది. ఇంతవరకు ఆమె కడుపులో నలుసు పడలేదు. ఈమధ్యకాలంలో విద్యాబాలన్ కడుపులో నలుసు పడిందని, త్వరలో ఆమె తాను గర్భిణిని అన్న విషయం బహిరంగంగా ప్రకటిస్తుందన్న రూమర్లు వచ్చాయి. ఇలా రూమర్లు వస్తూ వుండటంతో విద్యాబాలన్ దంపతులకు సన్నిహితులైన చాలామంది విద్యాబాలన్‌కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారట. అబ్బాయి పుడితే ఏ పేరుపెడతావ్... అమ్మాయి పుడితే ఏ పేరు పెడతావ్ అని ప్రశ్నలతో వేధిస్తున్నారట. ఆలులేదు.. చూలు లేదు కొడుకుపేరు... అన్నట్టుగా తనకు వస్తున్న ఫోన్ కాల్స్.ని తట్టుకోలేక విద్యాబాలన్ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన వివరణ ఇచ్చేసింది. తాను ప్రస్తుతం గర్భిణిని కాదని, ప్రస్తుతం తనకు గర్భం ధరించే ఆలోచన గానీ, పిల్లల్ని కనే తీరిక గానీ లేదని చెప్పింది. ఏవిటో... ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలంటారు.. విద్యాబాలన్‌కి పెళ్ళి ముచ్చట లేటుగానే తీరింది. పిల్లల ముచ్చట తీరడానికి ఇంకా ఎంత లేటవుతుందో ఏం పాడో.. అయినా మనకెందుకులే!