స్వామిగౌడ్ అయ్యారు ఎమ్మెల్సీ !

 

 

TRS Swamy Goud, Swamy Goud MLC, Swamy Goud BJP,TRS  MLC Swamy Goud

 

 

స్వామిగౌడ్ ఇక ఎమ్మెల్సీ అయిపోయినట్లే! అదేంటి స్వామిగౌడ్ పోటి చేసి గెలవకుండానే ఎలా ఎమ్మెల్సీ అయిపోయారు అనుకుంటున్నారా? తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వామిగౌడ్ సకల జనుల సమ్మె విజయవంతానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరిన స్వామి గౌడ్ ను మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.

 

ఈ నేపథ్యంలో ఈ స్థానం నుండి పోటీలో దిగాలి అనుకున్న బీజేపీ తీవ్ర తర్జన భర్జనల నడుమ పోటీకి దిగకూడదని నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్ రావులు ఈ మేరకు పార్టీలో వాదించి పోటీ పెట్టకుండా నిరోధించినట్లు తెలుస్తోంది. బీజేపీ వెనకడుగు వేయడంతో స్వామిగౌడ్ గెలుపు నల్లేరు మీద నడకే అని భావించాలి. మొత్తానికి స్వామిగౌడ్ అయ్యారు ఎమ్మెల్సీ..!