తెలంగాణ పై చంద్రబాబు స్పందన

 

Telangana chandrababu, Chandrababu telangana state, Separate telangana tdp, Congress Telangana

 

 

తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రేగకుండా నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. కొత్త రాజధాని అభివృద్ధి చేయడానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, కొత్త రాజధానిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నిర్థిష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు.

 

సాగునీటి సమస్య ఎలా పరిష్కారిస్తారో చెప్పాలన్నారు. ఉద్యోగాలు, విద్యుత్, వనరుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నామన్నారు.  కేంద్ర నిధులతో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సూచించారు.



అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినా ప్రజల మధ్య సమైక్యత ఉండాలని బాబు కోరారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదని హితవు చేశారు.