ఎస్సారెస్పీకి దామోదర్‌ రెడ్డి పేరు : సీఎం రేవంత్‌రెడ్డి

 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని సీఎం అన్నారు.  సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలవకపోయిన ప్రజల కోసం ఆయన పనిచేశారని రేవంత్‌ తెలిపారు. ఎస్సారెస్పీ-2కి ఆర్‌డీఆర్‌  దామోదర్‌ రెడ్డి అని నామకరణం చేస్తామని దీనిపై 24 గంటల్లో జీవో తెస్తామని సీఎం అన్నారు. 

ఆయన కుటుంబానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తాం. దామన్న మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సంతాపం తెలిపారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్నా దామోదర్ రెడ్డి.. తన ఆస్తులు నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలకే అంకితం చేశారని కొనియాడారు. 

భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా దామోదర్ రెడ్డి కుటుంబానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా రిజర్వేషన్ల పరంగా తుంగతుర్తి నియోజకవర్గం వదిలి సూర్యాపేటకు వెళ్లినప్పటికీ కూడా దామోదర్ రెడ్డి సొంత ప్రాంతాన్ని ఏనాడు మర్చిపోలేదని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఒకప్పటి సుజాతనగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్య వహించిన రాంరెడ్డి సోదరులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి జోడిద్దుల్లాగా జెండాను మోసారని గుర్తు చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu