‘అంజాన్’తో 150కోట్లపై కన్నేసిన సూర్య
posted on Jun 23, 2014 4:20PM

బాలీవుడ్ సినిమా మార్కెట్ 100 కోట్ల క్లబ్‌ను దాటి.. 300కోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు అక్కడ చిన్న సినిమాకి హిట్ టాక్ వస్తే చాలు 100 కోట్ల సినిమా క్లబ్ లో ఈజీగా చేరిపోతుంది. బాలీవుడ్ తరువాత 100 కోట్లను టచ్ చేసిన సినిమాలు తమిళ్ లోనే వున్నాయి. లేటెస్ట్ గా హీరో సూర్య తన ‘అంజాన్’ చిత్రంతో 150కోట్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాదీ అంతటా పాపులారీటి వున్న హీరోలలో ఒకరు సూర్య. ఆయన చిత్రాలు తమళంతో పాటు తెలుగులోను క్రేజ్ ఎక్కువే. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘అంజాన్’ చిత్రం 150కోట్లను క్రాస్ చేస్తుందని ఆ చిత్ర నిర్మాతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ బాషాలలో ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంగీతం యువన్ రాజా అందిస్తున్నారు.