రాష్ట్రపతి వద్దకు ఎంపీల సతీమణులు

 

 

 

సమైకాంధ్ర ప్రదేశ్ కోసం ఏపీ ఎన్జీఓలు చేస్తున్న ఉద్యమంలోకి రాజకీయ నాయకులను రానీయకపోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు తాముగా పోరాడుతున్నారు. అయినా వారికి సీమాంధ్రుల నుండి సెగల తప్పడంలేదు. వారు చేస్తున్న ప్రయత్నానికి మరింత బలం, పాపులారిటీ రావడం కోసం సీమాంధ్ర రాజకీయ నాయకుల సతీమణులను కూడా ఉద్యమంలోకి దించుతున్నారు. గతంలో వీరంతా రాష్ట్ర గవర్నర్ ని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పోరాటం ఢిల్లీకి కూడ చేరబోతుంది.

 

 

సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు మద్దతుగా వారి సతీమణులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నానం వీరు ప్రణబ్ ముఖర్జీని కలవడానికి అపాంట్ మెంట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజించే దిశగా ఏ చర్యలూ తీసుకోవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరనున్నారు. వీరు ఢిల్లీ వెళ్లడాన్ని చూస్తే కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాలతో సహా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేశామని చెప్పుకోవడాని తప్ప వీరు ఢిల్లీ వెళ్ళి ప్రయోజనం లేదని, ఒకవేళ సీమాంధ్ర కాంగ్రెస్ వారు నిజంగా సమైక్యరాష్ట్రం కోరుకుంటే అధిష్టాన్ని దిక్కరించి, పార్టీకి పదవులకు రాజీనామా చేస్తే సరిపోతుంది కదా ? ఇలా కుటుంబాలను రోడ్డు పైకి తేవడం దేనికి అని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu