చండాలునిగా నాగ్ ఫోటో
posted on Mar 3, 2013 9:39AM

అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల రచయిత జె.కె. భారవి దర్శకత్వంలో వస్తున్న 'శ్రీ జగద్గురు ఆది శంకర" లో కింగ్ అక్కినేని నాగార్జున ఓ షాకింగ్ గెటప్ లో కనిపించనున్నారు. ఆది శంకరుని జీవిత చరిత్రగా రూపొందే ఈ చిత్రంలో శంకరాచార్య కి కాశీలో దర్శనమిచ్చే చండాలుని పాత్రను నాగార్జున చేస్తున్నారు. ఈ గెటప్ కు సంబంధించిన షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. ఇందులో నాగార్జున్ నల్ల డ్రెస్ లో సరికొత్తగా కనిపించారు.
ఇటీవల ఆది శంకరాచార్య పాత్రధారి కౌశిక్, నాగార్జున పాల్గొనగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాలకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా, ఎస్. గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణ బాధ్యతలు వహించారు. అలాగే ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శ్రీహరి కూడా ప్రధాన పాత్రలు చేస్తున్నారు.