ప్రియుడిపై యాసిడ్ పోసి.. కత్తితి పొడిచి.. పెళ్లి చేసుకోలేదని ప్రియురాలు కిరాతకం

ప్రేమకు ఒప్పుకోవడం లేదని, పెళ్లికి నో చెబుతుందని  ప్రేమికులు. యువతులపై యాసిడ్ పోయడం తరుచూ జరుగుతుంటాయి. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్సైంది. తనతో సహజీవనం చేయడం లేదని ప్రియుడిపైనే ప్రియురాలికి దాడికి దిగింది. ఏకంగా  యాసిడ్ పోసింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదేమో... కత్తితో పొడిచేసింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో పట్టపగలే జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని పెళ్లాడాడు ఓ యువకుడు. దీంతో కొపం పెంచుకున్న ప్రియురాలు మాట్లాడుకుందాం అని వచ్చి యాసిడ్‌ పోసింది. అంతటితో ఆగకుండా కత్తితో పొడిచింది. ఆ తర్వాత తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.

కేరళ రాష్ట్రం తిరువనంతపురంనకు చెందిన రాకేష్‌(30), కాంచీపురానికి చెందిన జయంతి (27) మూడేళ్లుగా దుబాయ్‌లోని ఓ మసాజ్ సెంటర్‌లో పనిచేశాడు. చెంగల్పట్టు జిల్లా మీనంబాక్కం తిరువల్లువర్ రోడ్డుకు చెందిన జయంతి (27) కూడా ఇదే మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. జయంతికి వివాహమై ఒక ఆడపిల్ల కూడా ఉంది. కానీ ఆమె భర్త నుండి విడిపోయి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. దుబాయ్‌లో ఒకే చోట పని చేస్తూ రాజేస్-జయంతి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. సహాజీవనం కూడా చేశారు. ఈ స్థితిలో రాకేష్ తన సోదరి పెళ్లి కోసం కేరళ వెళ్తున్నట్లు జయంతికి చెప్పాడు. ఇలా ఇద్దరు అర్నెల్ల క్రితం దుబాయ్ నుంచి తమిళనాడుకు తిరిగి వచ్చేశారు.

అయితే ఇటీవల జయంతికి తెలియకుండా రాకేష్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫోన్‌ చేసి గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రాకే‌ష్‌పై పోసి, కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.