విజయమ్మ పుస్తకం తప్పుల తడక!  వైఎస్సార్ అనుచరుడి సంచలనం..  

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. వైఎస్సార్ పాలన, జగన్ పాదయాత్ర, షర్మిల పార్టీకి సంబంధించి తీవ్ర  వ్యాఖ్యలు చేశారు.. దివంగత వైఎస్సార్ ముఖ్య అనుచరుడు గోనే ప్రకాష్ రావు. వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్‌ఆర్ పుస్తకంలోని 172వ పేజిలో తప్పులు రాసారని చెప్పారు. 
వైఎస్ పాదయాత్రలో జగన్ కూడా ఉన్నారని విజయమ్మ రాశారని, కాని అది అబద్ధం అని గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. వైఎస్ పాదయాత్ర జరిగినన్ని రోజులు అంబటి, లగడపాటి, భూమన కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్టిలు ఉన్నారన్నారు. జగన్ ఎక్కడా వైఎస్ పాదయాత్రలో పాల్గొనలేదన్నారు. అది నిజమని నిరూపిస్తే తిరుపతిలో ఉరేసుకుంటా అంటూ వైఎస్ఆర్, జగన్ అభిమానులకు అని గోనే ప్రకాశ్ రావు సవాల్ విసిరారు.

బీజేపీ అనుకుంటే కేసీఆర్, జగన్ జైలుకెళతారని  గోనె ప్రకాష్ రావు అన్నారు. జగన్ బెయిల్ రద్దవుతుందని తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు మాట్లాడారని... బెయిల్ రద్దు అయితే జైలుకే కదా వెళ్ళాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెండు ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.  ఎక్కడైనా ఈ మాటలు మాట్లాడుతానని తెలిపారు. కొందరు ఫోన్లు చేసి కవ్వింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ మాటలు ఎక్కడైనా మాట్లాడుతానంటూ కవ్వింపులకు పాల్పడే వారికి ఆయన సవాల్ విసిరారు.  గోనెను గెలికితే  అందరి బండారాలు పురాణాలుగా బయట పెడుతా అని ఆయన హెచ్చరించారు.

వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి కీలక కామెంట్లు చేశారు గోనే ప్రకాష్ రావు.జగన్ మోసం చేయడం వల్లే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని చెప్పారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్‌ విజమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని గోనె ప్రకాష్‌రావు ప్రశ్నించారు. ఇక ప్రజాస్వామ్య దేశంలో 124ఎ చట్టం అవసరం లేదన్నారు.  అది రాచరిక కాలం నాటి చట్టమని... ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆ చట్టం అవసరం లేదన్నారు గోనె ప్రకాష్‌రావు.