కడప మేయర్‌ ఇల్లు కూల్చివేత...

 

 

 

ఇతరుల స్థలాన్ని కబ్జాచేసి కడపజిల్లా మేయర్‌ రవీంధ్రనాధ్‌రెడ్డి కట్టిన ఇంటిని సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ అధికారులు కూల్చివేశారు. అధికారులు చెప్తున్న ప్రకారం... జూబ్లీహిల్స్‌లో నీరజారావు అనే మహిళకు చెందిన భూమిని ఆయన కొంత కాలం క్రితం ఆక్రమించి అనంతరం అందులో భవనం కట్టుకున్నారు. దీనిపై బాధితురాలు హైకోర్టుకు మొరపెట్టుకోవడంతో... విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ కూల్చివేతకు ఆదేశాలిచ్చారు..