సిట్రస్ పండ్లతో గుండె జబ్బులకు చెక్

 

సిట్రస్ పండ్లను మహిళలు తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది.

మహిళలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లను జ్యూస్ రూపంలోనూ లేదా అలాగే తీసుకోవడం ద్వారా గుండెపోటును నివారించవచ్చును.

నిమ్మ, ఆరెంజ్, ఉసిరి లాంటి సిట్రస్ పండ్లతో పాటు ఆపిల్, దాక్ష, దానిమ్మ వంటి వాటిని తీసుకోవడం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది.

తాజా కూరగాయలు, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్‌లలో ఫ్లావోనోయిడ్స్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

 

మహిళలు ముఖ్యంగా విటమిన్ "సి"గల పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలని, దీనివలన సిట్రస్ పండ్లలోని ఫ్లావోనోయిడ్స్ గుండెకు సంబంధించిన రక్తపు నాళాల పనితీరును మెరుగుపరుస్తాయని, తద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనం ద్వారా వెల్లడైంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu