సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కిడ్నాప్, దాడి

యువతలో రీల్స్, కామెంట్లు, లైకుల పిచ్చి వెర్రితలలు వేస్తున్నది. సోషల్ మీడియాలో తాము పోస్టు చేసిన రీల్స్ కు మామెంట్లు, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తోంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, తెలియని వారిపై దాడులు, కడ్నాప్ లకు పాల్పడడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్ లో ఇద్దరు బాలికలు, ఓ యువతి సోషల్ మీడియాలో లైకుల కోసం ఓ గ్యాంగ్‌గా ఏర్పడి,  యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన జబల్ పూర్ లో వెలుగు చూసింది.  

  ఓ యువతిని ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసి,  ఆమె జుత్తు పట్టుకుని విచక్షణారహితంగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదులో రంగంలోని దిగిన పోలీసులు ఆ గ్యాంగ్ ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ లో 17 ఏళ్ల బాలికలు ఇద్దరు, ఓ యువతి ఉన్నారు. సామాజిక మాధ్యమంలో సెలిబ్రిటీలుగా మారాలన్న ఉద్దేశంతోనే వారీ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరు ఇంతకు ముందు కూడా ఇదే తరహాలో మరికొందరు యువతులపై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu