ఎన్టీఆర్ 'బాద్ షా' హంగామా

      ఆంధ్ర రాష్ట్రంలో యంగ్ టైగర్ 'బాద్ షా' హంగామా మొదలైంది. ఎపిలోని అన్ని థియేటర్ల ను 'బాద్ షా' అభిమానులు భారీ కటౌట్లతో నింపేస్తున్నారు. నందమూరి అభిమానులు 'బాద్ షా' పోస్టర్లతో రాష్ట్రం మొత్తం పండగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ లో ఈ మూవీ పై హాట్ చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించేవన్ని ఈ చిత్రం లో ఉంటాయి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ చిత్రాలలోని హిట్ సాంగ్స్ జూనియర్ ఎన్టీఆర్ చేసే డాన్సులు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని అంటున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ ఓ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించగా, ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం స్పెషల్ అట్రాక్షన్.        

8 నిమిషాల పాట కోసం కోటిన్నర ఖర్చు

        మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించే ‘రేయ్’ సినిమా క్లైమాక్స్ పాట కోసం ఏకంగా రూ. కోటిన్నర ఖర్చు పెడుతున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ పాటను 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారు.చిత్ర దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి అమెరికాలో చూసిన ఓ లైవ్ షోతో ప్రభావితుడై ఇలా క్లైమాక్స్ ప్లాన్ చేశాడట. ఈ పాటకోసం సంగీత దర్శకుడు చక్రి, పాట రచయిత చంద్రబోస్ ఎంతో కష్టపడ్డారని ఆయన చెబుతున్నారు. చక్రి, భార్గవి పిళ్లై ఎంతో కష్టపడి ఈ పాటను పాడితే నృత్య దర్శకుడు ప్రేమ రక్షిత్ దీనిని చూసి ఎంతో ఉద్వేగానికి లోనై పలు సినిమాల అవకాశాలు వదులుకుని మరీ దీనికి డ్యాన్స్ కంపోజింగ్ చేశాడట. మొత్తం ఎనిమిది నిమిషాల పాటు ఈ పాట ఉంటుంది.

బ్యాట్ మెన్ కారు.. ఎన్టీఆర్ బాద్‌షా లో!

యంగ్ టైగర్ బాద్ షా రిలీజ్ దగ్గర పడే కొద్ది ఈ సినిమా కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హాలీవుడ్ మూవీ బ్యాట్ మెన్ లో ఉపయోగించిన కారును ఎన్టీఆర్ వాడుతారు అంటూ చెప్పారు రచయిత కోన వెంకట్. అయితే ఏప్రిల్ ఒకటో తేదిన ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం పై అనుమానాలు కూడా వస్తున్నాయి..నిజంగానే సినిమాలో ఈ కారును వాడి వుంటే చిత్ర యూనిట్ సభ్యులు ఇంతకాలం ఎక్కడా బయట పెట్టకపోవడం విశేషం. కాని అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి కోన వెంకట్ ఈ ఫోటో పోస్టు చేసారా? అనేది తేలాల్సి ఉంది.  

తిరుమలలో డైరెక్టర్ లారెన్స్ ను తోసేశారు

        ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ తిరుమల ఆలయ సిబ్బంది పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్ధం తల్లి, భార్య, కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి లారెన్స్ తిరుమలకు వచ్చారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో భక్తుల పట్ల సిబ్బంది తీరును తీవ్రంగా నిరసించారు. సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని, మొక్కు తీర్చుకునే సమయంలో తన భార్య, తల్లిని పలుమార్లు తోసేశారని, కుక్కలకన్నా హీనంగా తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిబంధనల ప్రకారమే లారెన్స్ కు దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది టీటీడీ అధికారులు అన్నారు.

'బాద్‌షా' సెన్సార్ టాక్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మరో విశేషం. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని, తప్పకు౦డా ఘన విజయం సాదిస్తుందని అన్నారట. 'బాద్ షా' లో మూడు పాటలకు ఎన్టీఆర్ అద్భుతమైన డాన్సులు చేశాడట. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా వచ్చాయని, సినిమాలో అన్ని అంశాలు చక్కగా కుదిరాయని, తప్పకుండా బాద్ షా అభిమానుల అంచనాలను అందుకుంటుందని చెప్పారట. సెన్సార్ సభ్యులు సినిమా మెచ్చుకున్ననందుకు చాలా సంతోషంగా ఉందని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అన్నారు. ఏప్రిల్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

నాగ్ 'గ్రీకు వీరుడు' ఆడియో ట్రాక్ లిస్ట్

        కింగ్ అక్కినేని నటిస్తున్న గ్రీకు వీరుడు ఆడియో ఏప్రిల్ 3న హైద‌రాబాద్ శిల్పక‌ళావేదిక‌లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో ట్రాక్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ మేన్ గెటప్ లో కనిపించనున్నారు. నయనతార, మీరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'గ్రీకువీరుడు' తో నాగ్ న్యూ ట్రెండ్ ని సృష్టిస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఏంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఆడియో ట్రాక్ లిస్ట్: 1. ఐ హేట్ లవ్ స్టోరీస్ 2. నే విన్నది నిజమేనా..  3. ఓ నాడు వాషింగ్టన్ 4. ఈ పరీక్షలో తన్నకు.. 5. ఎవ్వరు లేరని.. 6. ఓసినా బంగారం.. 7. మరో జన్మే...

రవితేజ, కరుణాకరన్ ల ప్రేమకథ!

      మాస్ సినిమా తప్ప క్లాస్ సినిమాలతో మెప్పించని హీరో రవి తేజ. క్లాస్ సినిమాలు తప్ప మాస్ సినిమాలతో మెప్పించని డైరెక్టర్ కరుణాకరన్. నిజంగా వీరిది ఒక విచిత్రమైన కాంబినేష‌న్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరూ జోడీ క‌ట్టబోతున్నారు. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా, ఈ కాంబినేష‌న్ త్వర‌లోనే ప‌ట్టాలెక్కబోతుంద‌ట‌. ర‌వితేజ కోసం కరుణాకరన్ అద్భుత‌మైన క‌థ రెడీ చేస్తున్నాడు‌. ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాత నిర్మించ‌బోతున్నారు‌. మ‌రి మాస్ క్లాస్ క‌ల‌యిక‌లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

మళ్ళీ 'అల్లరి' చేయనున్న నరేష్, ర‌విబాబు

        అల్లరి సినిమా నరేష్, రవి బాబు కేరియార్స్ ను మార్చేసింది. 2002లో వచ్చిన ఈ సినిమా తో నరేష్ టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విడుదలై సంచ‌ల‌నం సృష్టించింది.. ఈ సినిమాయే న‌రేష్ ఇంటిపేరుగా మారిపోయింది. ర‌విబాబు చేసిన ప్రయ‌త్నం మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అల్లరి త‌ర్వాత న‌రేష్ అండ్ ర‌విబాబు 2006లో పార్టీ సినిమాతో మ‌రోసారి జోడీ క‌ట్టారు. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత న‌రేష్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ర‌విబాబు. ర‌విబాబు నుంచి పూర్తి స్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ వ‌చ్చి చాలాకాల‌మే అయింది.. ఆ మ‌ధ్య న‌చ్చావులే త‌ర్వాత మ‌ళ్లీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ తీయ‌లేదు ర‌విబాబు.. ఇప్పుడు న‌రేష్ తో క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ థ్రిల్లర్ కు స్టోరీ రెడీ చేసుకుంటున్నాడు. మ‌రి మూడోసారి జోడీ క‌డుతున్న న‌రేష్, ర‌విబాబు ఆడియ‌న్స్ ను ఏ రేంజ్ లో కిత‌కిత‌లు పెడ‌తారో చూడాలి..!  

పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ గా గబ్బర్ సింగ్ 2

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిన సినిమా 'గబ్బర్ సింగ్'. టాలీవుడ్ లో కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా కు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ వరుస పరాజయాలతో సతమవుతున్న టైం లో వచ్చిన గబ్బర్ సింగ్, ఆయన కేరియార్ కు మళ్ళీ జోష్ నిచ్చింది. వరుస ఫ్లాప్ లు వచ్చిన పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప..అణువు కూడా తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ తీయ్యాలని డిసైడ్ అయ్యాడు. అది తన సొంత బ్యానర్ లో ఈ సినిమా ను నిర్మించనున్నట్లు తెలిసింది. కాని ఈ సీక్వెల్ కి డైరెక్టర్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.

రోజా 'మధుబాల' సెకండ్ ఇన్నింగ్స్

        మణిరత్నం ‘రోజా’ చిత్రంతో జాతీయ స్థాయిలో తన నటనతో అలరించి మధుబాల గుర్తుంది కదూ. ఆ తరువాత తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో “అల్లరిప్రియుడు” సినిమాతో అలరించింది. ఆ తరువాత కొన్నాళ్లకు తెరమరుగయిన అమ్మడు తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ మన ముందుకు రానుంది. అదీ ఇప్పుడు తల్లి పాత్రలో మనకు కనపడనుంది.   ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న “అంతకుముందు ..ఆ తరువాత” సినిమాలో సుమంత్ కు తల్లిగా మధుబాల మనకు కనిపించనుంది.  ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల 1990లో మళయాళ చిత్రంతో  వెండితెరమీద అరంగేట్రం చేసినా మణిరత్నం రోజా సినిమాతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కన్నడ, తమిళ, తెలుగు చిత్రాలు చేసిన ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. రెండేళ్ల నుండి అవకాశాలు లేని ఆమె ఇప్పుడు తల్లి పాత్రలతో అలరించేందుకు సిద్దమవుతుంది.

జెన్నీఫర్ చాలా కాస్ట్‌లీ గురూ

        కోల్‌కతాలో వచ్చే నెల 2న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆరో సీజన్‌కు గ్రాండ్‌గా హంగామా చేయాలని నిర్వాహకులు ప్లాన్ వేశారు. ఏకంగా హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌ను రప్పించాలని ఆరాటపడ్డారు. ఖర్చు కాస్త ఎక్కువయినా ఫర్వాలేదని సిద్ధపడ్డారు. ఐపీఎల్ బాస్‌లు జెన్నిఫర్‌ను సంప్రదించడం.. భారత్ రావడానికి ఈ అందాల భామ ఓకే చె ప్పడం చకచకా జరిగిపోయాయి. ఇంకేం ఈ అమ్మడు వచ్చేసినట్టేనని మనోళ్లు సంబరపడిపోయారు. అయితే, 43 ఏళ్ల సుందరి చెప్పిన కోర్కెల చిట్టా వినగానే తలతిరిగినంత పనైపోయిందట! జెన్నీ కంటే స్వదేశీ టాలెంటే బెటరనుకుని ఫిక్సయిపోయారు. ఇంతకీ హాలీవుడ్ భామ ఏం డిమాండ్ చేసిందంటే రానూ.. పోనూ ఓ ప్రత్యేక విమానం చాలందట. ఇక వ్యక్తిగత అలంకార సిబ్బంది, సహాయకులు, ఆఖరికి వంట మనిషిని కూడా వెంటతెచ్చుకుంటానని సెలవిచ్చింది. గ్రూప్ అందరికీ కలిపి స్టార్ హోటల్లో డజన్ల కొద్దీ గదులు బుక్ చేయమం ది. ఇందుకో సం అయ్యే ఖర్చునంతా గిఫ్ట్‌గా ఆఫ ర్ ఇచ్చింది. ఆడిపాడినందుకు ఎలాగూ భారీ మొత్తం సమర్పించుకోకతప్పదు. అమ్మడు డిమాండ్లు వినగానే ఐపీఎల్ బాస్‌లు సైలెంట్‌గా సైడయిపోయారట. ఇంత మొత్తం తమ వల్ల కాదంటూ.. ఈసారికి షారుక్, కత్రినా, దీపికతో సరిపెట్టుకున్నారు.

జస్టిస్ చౌదరి గెటప్‌లో ఎన్టీఆర్

  తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామరావుగారు తన నట జీవితంలో చేసిన వివిద రకాలయిన పాత్రలు, మరిక ఎప్పుడూ, ఎవరూకూడా చేయలేరని చెప్పవచ్చును. సామాన్యులని తన నటనతో ఆయన ఏవిధంగా మెప్పించారో, మహా మేదావులని కూడా అదే తీరున మెప్పించిన ఘనుడాయన. అయితే, అటువంటి మహా నటులు, గొప్ప పాత్రలు ఇప్పటి సినిమాలలో మనం చూసే అవకాశం లేదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ తాతగారికి ఏకలవ్య శిష్యుడు అనదగ్గ యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ మాత్రం అప్పుడప్పుడు తన సినిమాలలో ఆయనను అనుకరిస్తూ, అయన డైలాగులు పలుకుతూ మళ్ళీ ఆయన స్మృతులను మనకు జ్ఞాపకం చేస్తుంటాడు.   గతంలో జూ.యన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో మరో అడుగు ముందుకు వేసి గ్రాఫిక్స్ మాయజాలంతో ఏకంగా తాతగారితో కలిసి డైలాగులు చెప్పడమే కాకుండా కలిసి స్టెప్పులు కూడా వేశాడు. దానికి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఇప్పుడు త్వరలో విడుదల కానున్న తన బాద్షా సినిమాలో కూడా చేయబోతున్నట్లు సమాచారం.   ‘80లలో విడుదల అయిన నందమూరి వారి సూపర్ హిట్ సినిమా ‘జస్టిస్ చౌదరీ’ లో ఆయన నట విశ్వరూపం గురించి, ఆయన ధీర గంభీర స్వరంతో పలికిన భారీ డైలాగుల గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో తాతగారు పలికిన డైలాగులను బాద్షాలో జూ.యన్టీఆర్ చెప్పబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ మాయజాలంతో జూ.యన్టీఆర్ తాతగారితో కలిసి నటించిన ఒక కోర్టు సీను ఇంటర్వెల్ తరువాత ఉంటుందని సమాచారం.   ఇక, వీటికి అదనంగా యంగ్ టైగర్ చెప్పే పంచ్ డైలాగులు, చేసే ఫైట్స్, డ్యాన్సులు సినిమాలో ఉండనే ఉంటాయి. అవన్నీ చూసి ఆనందించాలంటే సినిమా కోసం మరికొంత కాలం ఎదురుచూపులు తప్పవు.

ఫట్ మన్న తమన్నా బాలీవుడ్ చిత్రం హిమ్మత్ వాలా

  తమన్నా ఎంతో ఆశతో ఎదురుచూసిన బాలీవుడ్ చిత్రం హిమ్మత్ వాలా బాక్సాఫీస్ వద్ద కుదేలైపోయింది. తమన్నా తన అందాలన్నిటినీ రెచ్చిపోయి చూపించినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి సాహసించడం లేదు. తమన్నా ఈ చిత్ర ప్రమోషన్ లలో స్టేజీ లేక్కినా ఎవరూ ఈ చిత్రం గురించి పట్టించుకోవడం లేదు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఒక విచిత్రమైన స్థితిలో చిత్ర హీరో అజయ్ దేవగణ్ ఇరుక్కుపోయాడు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా హీరో అజయ్ దేవగణ్, తమన్నా పాల్గొన్నారు. తమన్నా మాట్లాడుతూ అజయ్ దేవగణ్ సిగరెట్లు తాగడం తగ్గిస్తే మంచిదని కోరింది. ఈ విషయంపై బాలీవుడ్ జనాలు తమన్నా పై కారాలు మిరియాలు నూరుతున్నారని తెలిసింది.

సోనియా అనుమతితో చిరు 150వ సినిమా

        చిరంజీవి 150వ సినిమాతో తెరపై ఎప్పుడు కనిపిస్తారా అని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదుచూస్తున్నారు. చాలా సందర్భాలలో 150వ సినిమాలో నటిస్తానంటూ చిరు కూడా చెప్పారు. తాజాగా బెంగుళూరు శివారులోని కేంబ్రిడ్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ‘చిగురు 2013′ సాంస్కృతిక ఉత్సవాలలో చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ “చక్కని సామాజిక సందేశం ఉన్న కథ దొరికితే వెంటనే సినిమా చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. కాకపోతే దానిలో నటించేందుకు సోనియాగాంధీ అనుమతి తీసుకుంటాను” అని అన్నారు. బెంగుళూరు నేను ఎన్నో సార్లు వచ్చాను. అయితే కేంద్ర మంత్రిగా ఇక్కడికి రావడం కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు.

'హిమ్మత్ వాలా' ఫట్: తమన్నా కు బ్యాడ్ టైమ్

        మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ 'హిమ్మత్ వాలా'. ఈ సినిమా విడుదలకు ముందు తమన్నా అందాన్ని అందరూ తెగ పొగిడేశారు. కాని సినిమా రిలీజ్ తరువాత మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎన్నో అంచనాలతో విడుదలైన 'హిమ్మత్ వాలా' కి నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఒరిజినల్ సినిమాలో శ్రీదేవి తన నటనతో అదరగొట్టగా, తమన్నాకు మాత్రం ఈ విషయంలో జీరో మార్కులే పడ్డాయి. డాన్సులు బాగానే చేసిన..నటనలో మాత్రం ఆమె ఏ మాత్రం భావాలు పలికించలేదని టాక్. డైరెక్టర్ సాజిద్ ఖాన్ సినిమా రీమేక్ చేయడంలో తడబడ్డట్టు సమాచారం. సినిమాను చాలా స్లోగా నడిపించి ఆడియన్స్ కు బోర్ కొట్టించాడని టాక్. హిట్ ఫిల్మ్ ను రీమేక్ చేసేటప్పుడు ఇంకా బెటర్ గా చేసే ప్రయత్నంలో తప్పులే ఎక్కువయ్యాయి. బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నా ను  'హిమ్మత్ వాలా' ఆదుకోలేకపోయాడు.

యాక్టర్ హర్షవర్ధన్ తో జ్వాలా గుత్తా డేటింగ్?

        ‘గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా సినిమా రిలీజ్ కి ముందే క్రేజ్ ను సంపాదించుకుంది. నితిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న జ్వాలా మరో హీరో తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా క్రీడాలకు దూరంగా వుంటూ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, హీరో హర్షవర్ధన్ రాణే తో డేటింగ్ చేస్తో౦దంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.   తెలుగులో తకిట,తకిట..అవును అనే సినిమాల్లో నటించిన ఈ హ్యాండ్ సమ్ హీరో.. జ్వాలా గుత్తా తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని సమాచారం. ఈ అమ్మడు ఆడియో ఫంక్షన్ కి, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన ఈ హీరో వెంట ఉండాల్సిందేనని అంటున్నారు. ఈ విషయం గురించి హర్షవర్ధన్ ను అడిగితె..మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్పితే మరేమీలేదని అన్నారు. మరి ఈ వార్తలపై  జ్వాలా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఎన్టీఆర్ 'బాద్ షా' పై భారీ అంచనాలు

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దూకుడు తరువాత శ్రీను వైట్ల చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో ఏది తక్కువైనా ఫ్యాన్స్ నిరాశ చెందే అవకాశం వుంది కాబట్టి, ఈ సినిమాలో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా శ్రీను వైట్ల జాగ్రతలు తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో సరైన స్టెప్పులేసి చాలా కాలం అవుతోంది. 'బాద్ షా' తో తారక్ ఆలోటును తీరుస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తన పంచ్ డైలాగ్స్, డాన్సులతో అభిమానులకి ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. దూకుడు సినిమాలో లాగే బాద్ షా లో బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ తమ కామెడీతో అలరిస్తారని అంటున్నారు. అయితే చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆకలితో ఉన్న యంగ్ టైగర్ ఈ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని చెబుతున్నారు.