swatchandra corporation funds golmol

స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నిధులు గోల్ మాల్.. పవన్ సమీక్షలో వెలుగులోకి!

ఆర్థిక అరాచకత్వంలో వైసీపీ అధినేత జగన్ కు సాటి రాగలవారెవరూ ఉండరు.  కేంద్ర నిధులను సైతం పక్కదారి పట్టించి పబ్బంగడుపుకుని రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చిన ఘనత జగన్ ది. అధికారంలో ఉండాగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఆయనకు ఇటీవలి ఎన్నికలలో జనం కర్రు కాల్చి వాత పెట్టిన చందంగా ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. సరే అధికారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వం గురించి కొంతే బయటకు తెలిసింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత... ఆయన లీలలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.  వాటిలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లో నిధుల గోల్ మాల్ ఒకటి. ఆ కార్పొరేషన్ లో  నిధులను హారతి కర్పూరంలా ఎలా కరిగించేశారు. ఎటు మళ్లించారు. అన్న వివరాలను ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, పంచయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  మంగళగిరిలోని తన నివాసంలో  పవన్ కల్యాణ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో  సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై మంత్రి అధికారులను ఆరా తీశారు.  2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.   ఆ ఆర్థిక సంవత్సరంలో కేంధ్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే.  స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమయితేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ పేర్కొన్నారు.  దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారు..  అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైంది. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా- ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని   పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే... ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే  పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని పవన్ అన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎమ్.డి., ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

pinnelli hide in bathroom

పిన్నెల్లి పిల్లిలా బాత్రూంలో దాక్కున్నాడు!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి. అధికారం కోల్పోగానే పిల్లిలా మారిపోయారు. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చిన సమయంలో పిల్లిలా బాత్ రూంలో దాక్కున్నారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అయితే గోడదూకి పరుగోపరుగు. సరే పిన్నెల్లిని బాత్ రూంలో నుంచి బయటకు తీసుకువచ్చి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.  ఆ సంగతి పక్కన పెడితే అధికార పార్టీ ఎమ్మెల్యే గా పిన్నెల్లి పల్నాడులో చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకూ బయటపడినవే కాకుండా ఆయన అరాచాలు  మరిన్ని ఇప్పుడు వెలుగులోకి వస్తాయని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  పోలింగ్ రోజు మొదలుకుని కౌంటింగ్ రోజు వరకు పల్నాడు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు అప్పటి సిట్టింగ్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డితో కలిసి పిన్నెల్లి సాగించిన దురాగతాలు, దౌర్జన్యాలూ ఇన్నన్ని కావని అంటున్నారు.   మాచర్ల పోలింగ్ బూత్లో ఈవీఎంల ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజంట్ నంబూరి శేషగిరిరావు పై విచక్షణ రహితంగా దాడి చేయడం, అడ్డొచ్చిన చెరుకూరి నాగ శిరోమణి  అనే మహిళపై దుర్భాషలాడడం  పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి.  ముందస్తు బెయిలు పిటిషన్లతో ఇన్నాళ్లుగా కాలం నెట్టుకొస్తున్న పిన్నేల్లికి బుధవారంతో  ఆ ఉపశమనం లేకుండా పోయింది. ఆయన  పిటిషన్లను న్యాయస్థానం కొట్టేయడంతో పిన్నెల్లి అరెస్టయ్యారు.  ఎన్నికల ఫలితాల ముందు వరకు నన్ను టచ్ చేసి చూడడండి, నేనేంటో చూపిస్తా, అంత సీన్ ఉందా మీకు అంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ఇప్పుడు పోలీసులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వస్తే పిల్లిలా బాత్ రూంలో దాక్కున్నారు.  ఆయన సోదరుడు పిన్నెల్లివెంకట్రామిరెడ్డి అయితే గోడ దూకి పారిపోయారు.  పిన్నెల్లి అరెస్టులో పల్నాడులో జనం దిపావళి చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.  ఇక తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి అయితే    పిన్నెల్లి సోదరుల బాధితులు   ధైర్యంగా బయటకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయండి అని పిలుపునిచ్చారు.  దీంతో పిన్నెల్లి సోదరుల దురాగతాలు, దౌర్జన్యాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ap high court orders on ysrcp offices

కూల్చొద్దు మొర్రో అన్న వైసీపీ.. రేపు చూద్దామన్న హైకోర్టు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా  నిర్మించిన, నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చేయబోతోందని జగన్ పార్టీ భయపడుతోంది. తమ కార్యాలయాలను గవర్నమెంట్ కూల్చేయబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందని వైసీపీ నాయకులు మొత్తుకున్నారు. అయితే తాను ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానంటూ ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం సదరు కట్టడాలను ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. పార్టీ కార్యాలయాలను అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. దీంతో కేసు విచారణ గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అప్పటివరకు పార్టీ కార్యాలయాలపై యదాతథ స్థితిని పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court is serious about Revanth governement

రేవంత్ సర్కారుపై హైకోర్టు సీరియస్ 

కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కాస్తా హైకోర్టు వరకు తీసుకెళ్లింది.  క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జ‌రుగుతోందో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు.  మంత్రి ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయ‌కుండా ఆపుతున్నారని కోర్టు ముందు విన్నవించారు. ఈ నెల 27 వరకు చెక్కులు పంపిణీ చేయ‌కుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి న్యాయ‌స్థానాన్ని కోరారు.      కౌశిక్ రెడ్డి పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జ‌రుగుతోందో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

On 29th of this month Janasena will go to Kondagatu

ఈ నెల 29న కొండగట్టుకు జనసేనాని 

రామభక్త హనుమాన్ కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పవన్, సాయి ధరమ్ తేజ్ వంటి సినీ హీరోలతో పాటు అనేక మంది రాజకీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు. వారాహి దీక్షలో ఉన్న పవన్.. కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నారు. మరోవైపు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు

pawan kalyan chappals

పవన్ కళ్యాణ్ చెప్పులు మోస్తున్న వైసీపీ!

చాలా పాత కథ ఒకటి వుంది. కొంతమంది సన్యాసులు పాదయాత్ర చేస్తున్నారు. దారిలో వారికి ఒక సెలయేరు లాంటిది అడ్డం వచ్చింది. అందరు దాన్ని దాటి అవతలి గట్టుకు చేరాలి. ఇవతలి గట్టు మీద ఒక అందమైన యువతి నిల్చుని వుంది. ఆ యువతి సెలయేరు దాటడానికి భయపడుతోంది. తన భయాన్ని ఈ సన్యాసుల బృందం దగ్గర వ్యక్తం చేసింది. అప్పుడు వారిలో వున్న ఒక సన్యాసి ఆ యువతిని ఎత్తుకుని సెలయేరుని దాటించాడు. ఆ తర్వాత సన్యాసులందరూ ముందుకు వెళ్ళిపోయారు. అయితే, యువతిని ఎత్తుకుని వదిలిపెట్టిన సన్యాసి ప్రశాంతంగా నడుస్తున్నాడు. కానీ, మిగతా సన్యాసులు మాత్రం లోపల లోపల ఉడికిపోతున్నారు.. కుమిలిపోతున్నారు.. వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు. అలా అందరూ మైళ్ళకు మైళ్ళు నడిచారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదో బాధపడుతున్నారని అర్థం చేసుకున్న ఈ సన్యాసి, ఏమైందని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ ఈ సన్యాసి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం సన్యాసులం.. మనం ఆడవాళ్ళకి దూరంగా వుండాలి. వాళ్ళని అస్సలు తాకకూడదు. కానీ, నువ్వు మాత్రం ఆ అందమైన అమ్మాయిని ఎత్తుకుని మరీ సెలయేరుని దాటించావు.. ఇది మన సన్యాసుల సంఘానికే అవమానం.. నువ్వు చేసింది చాలా పెద్ద నేరం అన్నారు. అప్పుడు ఈ సన్యాసి చిన్నగా నవ్వి, ‘‘నేను ఆ యువతిని అక్కడే వదిలేశాను.. మీరు మాత్రం ఇంకా మోస్తూనే వున్నారు’’ అన్నాడు. దాంతో ఈ సన్యాసులందరికీ బుద్ధి వచ్చి లెంపలేసుకున్నారు. ఇప్పుడీ స్టోరీ చెప్పడానికి ఒక కారణం వుంది.. అదేంటో ముందుముందు మీకే అర్థమవుతుంది. వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా సైన్యం చాలామంది పవన్ కళ్యాణ్ చెప్పులు మోస్తూ తమ జన్మలను ధన్యం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారాహి దీక్షలో వున్న పవన్ కళ్యాణ్ చెప్పులను మోయడం ద్వారా సదరు వర్గాలు దీక్ష ద్వారా పవన్ కళ్యాణ్ సాధించే ఫలితంలో కొంత భాగం సొంతం చేసుకుంటున్నారు.  పవన్ కళ్యాణ్ ఇటీవల ‘వారాహి దీక్ష’ పేరుతో ఒక దీక్షను ప్రారంభించారు. పదిరోజుల పాటు జరిగే ఈ కఠోర దీక్షను పవన్ కళ్యాణ్ శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. అయితే ఈ దీక్ష చేస్తున్న వాళ్ళు చెప్పులు ధరించాలో, ధరించాల్సిన అవసరం లేదో తెలియదుగానీ, పవన్ కళ్యాణ్ మాత్రం దీక్షా వస్త్రాలు ధరించి, చెప్పులు కూడా వేసుకుని కనిపిస్తున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన వైసీపీ వర్గాలకు పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికి ఒక పాయింట్ దొరికినట్టు అయింది. దీక్షలో వున్న పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకున్నారేంటి.. ఇది తప్పు కదా.. పాపం కదా అని కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా శ్రామికులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వేస్టుగాళ్ళకి ఏ కారణమూ దొరక్క, ఇలా వాళ్ళకి ఎంతమాత్రం సంబంధం లేని కారణాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. దీక్ష అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశం. ఆయన చెప్పులు వేసుకుంటారో, వేసుకోరో వీళ్ళకి ఎందుకంట? దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ కొద్దిసేపో చెప్పులు వేసుకుంటున్నారు. ఈ వైసీపీ బ్యాచ్ మొత్తం ఆ చెప్పుల్ని నిరంతరం నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. మొదట చెప్పిన సన్యాసుల కథలోని సన్యాసులకి, వీళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఆ కథలో సన్యాసులు బుద్ధి తెచ్చుకుని లెంపలు వేసుకున్నారు. ఈ వైసీపీ సన్నాసులకు మాత్రం ఎప్పటికీ బుద్ధిరాదు.

jagan name removed

జగన్మోహనపురం.. బోర్డు పీకేశారు!

తన ఐదేళ్ళ ఏలుబడిలో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన కామెడీలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ఆల్రెడీ రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన పేరు వేసుకోవడం, భూముల సర్వే చేసి, సరిహద్దు రాళ్ళమీద జగన్ బొమ్మ ముద్రించడం లాంటి సిల్లీ పనులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఒక ఊరుకే తన పేరు పెట్టుకున్నారు. కాకినాడకు సమీపంలోని పోలవరం అనే గ్రామానికి వెళ్ళే దారిలో వైసీపీ మూకలు గతంలో ఒక భారీ ఆర్చీ కట్టి, దాని మీద ‘వైఎస్ జగన్మోహనపురం’ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు. రెండు వైపులా జగన్ ఫొటోలు కూడా పెట్టారు. తమ్మవరం పంచాయితీలోని పోలవరం గ్రామానికి వెళ్ళే మార్గంలో నేమాం లేఔట్ పేరుతో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఆ కాలనీకి ‘వైఎస్ జగన్మోహనపురం’ అని పేరు పెట్టుకోవాలని వైసీపీ మూకలు భావించాయి. అయితే ఆ కాలనీ ముందు కాకుండా, పోలవరానికి వెళ్ళే ప్రధాన రహదారి మీదే పెద్ద ఆర్చీ కట్టేసి, పేరు పెట్టేశాయి. పోలవరం గ్రామ ప్రజలు దీనికి అభ్యంతరం చెబితే, వైసీపీ మూకలు బెదిరింపులకు దిగి అదుపు చేశాయి. ఇప్పుడు రాక్షస పాలన పోవడంతో పోలవరం గ్రామ యువకులు రంగంలోకి దిగారు. ఆర్చీ ఎక్కేసి వైఎస్ జగన్మోహనపురం అనే అక్షరాలను పీకేశారు. ఆర్చీ మీద జనసేన జెండా ఎగరేశారు. ఇదంతా చూసిన వైసీపీ వర్గాలు కుక్కినపేనుల్లా పడివున్నాయి తప్ప కిక్కురమనలేదు!

not posts need funds

పదవులు కాదు.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు బాబు లక్ష్యం!

జగన్ ఐదేళ్ల పాలనలో  ఆర్థికంగా దివాళా అంచుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టి అభృవృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆ దిశగా వేగం పెంచారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి సైతం అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మంత్రి పదవులు, హోదాల కంటే తాము కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులనే ఆశిస్తున్నామని చెప్పారు. లోక్ సభ స్పీకర్ ఎన్నిక బుధవారం (జూన్ 26) జరిగింది. ఓం ప్రకాష్ బిర్లానే స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే లోక్ సభ స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం రేసులో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎన్నికకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన లోక్ సభ స్పీకర్ ఎన్నికపై చంద్రబాబుకు వివరించడమే కాకుండా, ఆయన అభిప్రాయం కూడా కోరారు. దీంతో చంద్రబాబు అమిత్ షాకు తమకు కావలసింది పదవులు కాదనీ, రాష్ట్ర అభివృద్ధి కోసం పుష్కలంగా నిధులు అని స్పష్టం చేశారు. అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలలో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు వివరించారు. రాష్ట్రం ఆర్ధికంగా చాలా కష్టాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో పాలన సాఫీగా సాగాలంటే ముందు ఆర్ధిక పరిపుష్ఠి సాధించాలని చంద్రబాబు ఎంపీలకు తెలిపారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు  అమలు చేయాలంటే నిధులు కావాలని అందుకు ప్రతి ప్రజా ప్రతినిధి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందని చెప్పడమే కాకుండా,   ప్రతి ఎంపీకి మూడు శాఖలు కేటాయిస్తామనీ, ఆయా శాఖల ప్రగతికి నిధుల సమీకరణతో పాటు ప్రణాళికలు సూచించాల్సిన బాధ్యత, ఆ ప్రణాళిక మేరకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన బాధ్యత కూడా ఎంపీలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఇలా ఉండగా చంద్రబాబు రాష్ట్రానికి నిథులు కావాలన్న వినతిపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సంరద్భంగా ఇప్పటికే నంబూరు -అమరావతి్ర ఎర్రుపాలెం రైల్వే లైన్ మంజూరు చేస్తూ ప్రకటన వెలువడిన సంగతిని హోంమంత్రి గుర్తు చేశారు. 

protem speaker dispute

బీజేపీ ఒంటెత్తుపోకడకు నిదర్శనం ప్రొటెం స్పీకర్ వివాదం!

కొత్త లోక్‌ సభ సమావేశాల ప్రారంభం రోజునే పాలక, ప్రతిపక్షాల మధ్య  సయోధ్య, సభ సజావుగా సాగే అవకాశాలు లేవని తేలిపోయింది. సమావేశాల ప్రారంభమే ఓ వివాదానికి బీజం పడటంతో 18వ లోక్ సభ సాగే తీరు 17వ లోక్ సభ సాగిన తీరుకు పెద్దగా భిన్నంగా ఉండే అవకాశం లేదని తేటతెల్లమైపోయింది.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొడికున్నిల్‌ సురేశ్‌ను ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించే బదులు బీజేపీకి చెందిన భర్తృహరి మెహతాబ్‌ను ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా సభలో సీనియారిటీ ఉన్న సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం ఆనవాయితీ. అయితే బీజేపీ ఆ ఆనవాయితీని పాటించలేదు.   ప్రస్తుత లోక్ సభలో సురేశ్‌ అత్యంత సీనియారిటీ కలిగిన సభ్యుడు, ఆయన ఎనిమిది సార్లు  లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చి సురేష్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించి ఉంటే బీజేపీ హుందాగా వ్యవహరించిందని భావించడానికి దోహదపడేది. సభ సజావుగా సాగేందుకు అవసరమైన సానుకూల వాతావరణం ఏర్పడి ఉండేది. అలా కాకుండా బీజేపీ మొండి పట్టుదలకు పోయి మొండిపట్టుదలకు పోయి  ఏడు సార్లు లోక్‌ సభ సభ్యుడిగా ఎన్నికైన  భర్తృహరి మెహతాబ్‌ను  ప్రొటెం స్పీకర్ గా నియమించడం ద్వారా.. సభా నిర్వహణ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించబోతున్నదన్నది స్పష్టంగా తేలిపోయింది. పార్టీలతో సంబంధం లేకుండా సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం అన్నది సంప్రదాయం. అయితే బీజేపీకి భారత సంస్కృతి సంప్రదాయాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ సంప్రదాయాలను పాటించే విషయంలో పెద్దగా పట్టింపు ఉన్నట్లు కనిపించదు.   అసలింతకీ ప్రటెం స్పీకర్ బాధ్యతలు, హక్కులు అత్యంత పరిమితం. సభకు ఎంపికైన కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం, కొత్త స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకూ స్పీకర్ స్థానంలో కూర్చోవడం మాత్రమే. ఇంతోటి దానికి పంతానికి పోయి, పట్టుదలకు పోయి.. సంప్రదాయాన్ని తోసి రాజనడం ద్వారా బీజేపీ తన ఏకపక్ష వైఖరికి, విపక్షాలకు గౌరవం ఇవ్వని ధోరణిని చాటుకుంది.  లోక్‌సభ దీర్ఘకాల అనుభవం ఉన్న వ్యక్తిని ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించాల్సి ఉండగా బీజేపీ అందుకు భిన్నంగా వ్యవహరించడం సముచితం కాదని కాంగ్రెస్ పేర్కొంది.  ఈ నిర్ణయం ద్వారా  మోడీ సర్కార్ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

My daughter tears are not good: Renu Desai

నా కూతురు కన్నీళ్లు మిమ్మల్ని ముంచేస్తాయి: రేణు దేశాయ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ పట్ల పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆవేదన చెందుతున్నారు.  ‘‘మీకూ ఓ కుటుంబం ఉంది. అందులో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుపెట్టుకోండి. నా కుమార్తె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయి జాగ్రత్త’’ అని రేణుదేశాయ్ హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తన భార్య లెజినోవా, పిల్లలు అకీరానందన్, ఆద్యతో సరదగా దిగిన ఫొటో వైరల్ అయింది.  ఈ ఫొటోను ఉపయోగించి రేణుదేశాయ్‌ను అవమానించేలా కొందరు మీమ్స్ రూపొందించారు. వీటిపై స్పందించి రేణు.. కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫొటోను తాను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని పేర్కొంటూ మీమ్స్, జోక్స్ వేశారని పేర్కొన్నారు.  మీకూ ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. మీలాంటి వ్యక్తులను చూస్తుంటే అసహ్యమేస్తోంది. ఇలాంటి మీమ్ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు తప్పనిసరిగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి వందలసార్లు ఆలోచించాను. నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టు చేస్తున్నాను’’ అని రేణుదేశాయ్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన అందమైన ఫొటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత క్లిక్‌మనిపించిన ఫొటో ఇదని జనసేన పార్టీ తెలిపింది. ప్రమాణం చేసిన తర్వాత మంగళగిరిలోని నివాసానికి బయల్దేరామనుకుంటే.. ట్రాఫిక్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని, దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన జనసేనాని.. కాసేపు సేదతీరారని జనసేన పార్టీ తెలిపింది. ఈ సమయంలోనే భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా, ఆద్యలతో తీసుకున్న ఫొటో ఇది అంటూ అందమైన ఫొటో వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టింది.

om birla elected as loksabha speaker

లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓమ్ బిర్లా!

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓమ్ బిర్లా  ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఎన్నిక కావడం ఇది రెండోసారి. బుధవారం నాడు జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేష్ మీద విజయం సాధించారు. లోక్‌సభ స్పీకర్ పదవికి 48 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగడం ఇదే మొదటిసారి. లోక్‌సభ స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీల కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరగడం అనివార్యం అయింది.  బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. స్పీకర్‌గా ఓమ్ బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టగా, పలువురు ఇండియా కూటమి ఎంపీలు బలపరిచారు. ఆ తర్వాత మూజువాణి ఓటింగ్ నిర్వహించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ స్పీకర్‌గా ఓమ్ బిర్లా విజయం సాధించినట్టు ప్రకటించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెంటరాగా ఓమ్ బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. స్పీకర్‌గా మరోసారి ఎన్నికైన ఓమ్ బిర్లాను పార్లమెంట్ సభ్యులు అభినందించారు.

complaint on sajjala and karumuri

సజ్జల, కారుమూరి మస్తుగా మింగేశారు!

జగన్ అనకొండలాగా అందినకాడికి మింగేస్తుంటే, ఆయన ఆస్థానంలోని కొండచిలువలు ఊరకే ఉంటాయా? వాటికి సాధ్యమైంత అవి కూడా మిగేస్తాయి. జగన్ ఆస్థానంలో వున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు పిల్ల సజ్జల, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌తో వెయ్యి కోట్లు గుటుక్కుమనిపించేశారు. ఈ బడా స్కామ్‌ని సైదాపూరం మైనింగ్ భూముల యజమాని బద్రీనాథ్ వెలుగులోకి తెచ్చారు. ఈ మేరకు ఆయన ఈ కొండచిలువల మీద సీఐడీకి ఫిర్యాదు చేశారు.  అన్ని అనుమతులూ వున్నతన భూముల్ని లాక్కుని, మైనింగ్‌ చేసి వేల కోట్ల విలువైన క్వార్జ్‌ను విదేశాలకు తరలించారని నెల్లూరు సీఐడీ డీఎస్పీకి బద్రీనాథ్ ఫిర్యాదు చేశారు.  సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దోపిడీ వెనక ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.  లక్షా యాభైవేల టన్నుల క్వార్జ్.ని తవ్వేసి దగ్గరర దగ్గరగా వెయ్యి కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు.  ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై అప్పట్లో హైకోర్టులో కేసు వేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ఇప్పటికైన వారిపై చర్యలు తీసుకోవాలని క్వార్జ్‌ గనుల యజమాని బద్రీనాథ్ డిమాండ్ చేశారు. ‘‘నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జోగుపల్లిలో 240 ఎకరాల్లో గనులు ఉన్నాయి. దానికి చట్ట బద్దంగా అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ స్థానిక వైసీపీ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతలు బెదిరించి మైనింగ్‌ని చేజిక్కించుకుని రెండేళ్లుగా వందల కోట్ల విలువైన క్వార్జ్‌ని తవ్వేసి అమ్ముకున్నారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేశాను." అని సైదాపురం మైనింగ్‌ భూముల యజమాని బద్రీనాథ్  చెబుతున్నారు.

ycp fprmer minister Tremble

వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. చంద్రబాబు శ్వేతపత్రాలు!

ఏపీలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ  ప్ర‌భుత్వం కీల‌క రంగాల్ని నిర్లక్ష్యం చేసి వాటి పరిస్థితిని అధ్వానంగా మార్చేసింది. ల్యాండ్‌, ఇసుక‌, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోయాయి. కొంద‌రు మాజీ మంత్రులు, వైసీపీ నేత‌లే మాఫియాల‌ను వెన‌కుండి న‌డిపించారు. దీంతో ప‌లు రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల దోపిడీ ఐదేళ్లలో తారస్థాయిలో కొన‌సాగింది. ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డంతోపాటు, ప‌లు ప్రాంతాల్లో హ‌త్య‌ల‌కు సైతం తెగ‌బ‌డ్డారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంలో అవినీతిపై  ప్ర‌శ్నించేందుకు ప్ర‌జ‌లు వెన‌క‌డుగు వేశారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. వైసీపీ బాధితులు బ‌య‌ట‌కొచ్చి గ‌త ఐదేళ్లలో  త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలియ‌జేస్తున్నారు. దీనికితోడు అనేక కీల‌క రంగాల్లో మాజీ మంత్రులు, వైసీపీ నేత‌ల దోపిడీ ప‌ర్వం విచ్చ‌ల‌విడిగా కొన‌సాగింది. కీల‌క రంగాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వ్వ‌డంతో మాజీ మంత్రులు, వైసీపీ నేత‌ల్లో కేసుల భ‌యం మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొంద‌రు మంత్రులు, వైసీపీ నేత‌లు తప్పించుకునే మార్గాలను వెతుక్కునే పనిలో పడినట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఏపీ కేబినెట్ తొలి స‌మావేశం ఇటీవ‌ల జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై మంత్రి వ‌ర్గం చ‌ర్చించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఐదు హామీల అమ‌లుకు మంత్రివ‌ర్గం ఆమోదం వేసిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క రంగాల్ని ఎంత‌టి దారుణ ప‌రిస్థితుల్లోకి నెట్టేసిందో ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు వీలుగా మొత్తం ఏడు శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేయాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.  పోల‌వ‌రం, అమ‌రావ‌తి, విద్యుత్‌, ప‌ర్యావ‌ర‌ణం (ల్యాండ్‌, ఇసుక‌, మైనింగ్‌, త‌దిత‌ర రంగాల్లో దోపిడీ), ఎక్సైజ్ (మ‌ద్యం), శాంతిభ‌ద్ర‌త‌లు, ఆర్థిక శాఖ‌ల‌పై శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేయాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈనెల 28 నుంచి జూలై 18వ‌ర‌కు రెండు, మూడు రోజుల‌కొక‌టి చొప్పున ఈ శ్వేత‌ప‌త్రాల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో శ్వేతపత్రాలు విడుదల తర్వాత ఎవరెవరికి ముప్పు ఉంటుందనే అంశంపై రాష్ట్ర రాజ‌కీయాల్లో విస్తృత చర్చ జ‌రుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను తవ్వితీసే పనిని కూట‌మి ప్ర‌భుత్వం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఎక్సైజ్‌, ప‌ర్యావ‌ర‌ణం, విద్యుత్‌, ఆర్థిక శాఖ‌ల్లో గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తుండ‌టంతో.. శ్వేత‌ప‌త్రాల విడుద‌ల త‌రువాత‌ ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్ష‌న్ వైసీపీ నేత‌ల్లో నెల‌కొంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే గనులు, భూగర్భశాఖ కార్యాలయంతోపాటు ఎక్సైజ్‌శాఖ కార్యాలయాన్ని  సీఐడీ అధికారులు సీజ్‌ చేసి త‌మ‌ అధీనంలోకి తీసుకున్నారు. గత ఐదేళ్లలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతోపాటు మైనింగ్‌ లీజుల్లో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్న కూటమి ప్రభుత్వం..  ఆ డిపార్ట్‌మ్మెంట్‌లో ఏం జరిగిందో వివరించేందుకు శ్వేతప‌త్రం సిద్ధం చేస్తోంది. వైసీపీ హయాంలో గనులశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు. దీంతో ఆయన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మద్యం పాలసీలో బ్రాండెడ్‌ మద్యం అందుబాటులో లేకుండా పోయింది. నాసిరకం మద్యమే ప్రజలు తాగాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో పెద్ద స్కాం ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వం… ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బెవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేయ‌గా.. ఈ కేసులో ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్టుచేసే అవ‌కాశముంది.. ఇదే జరిగితే సంబంధిత శాఖ చూసిన వైసీపీ సీనియర్‌ నేత నారాయణస్వామి చిక్కుల్లో పడినట్లేనని రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఆర్థిక రంగంలో అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి నాలుగు శ్వేతపత్రాలను సిద్ధం చేస్తోంది. కాంట్రాక్టర్లకు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించారని, కొన్ని పనులు చేయకుండానే కోట్లు కుమ్మరించారని అనుమానిస్తున్న ప్రభుత్వం.. పక్కా ఆధారాల సేకరణతో శ్వేతపత్రాలు విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత శాఖ మాజీ మంత్రి రోజా, అనుమతులిచ్చేలా జీవోలు జారీ చేసిన పర్యాటక, మున్సిపల్‌ అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ప‌లు రంగాల్లో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో.. ఎప్పుడు ఎవ‌రి అరెస్ట్ ఉంటుందోన‌ని మాజీ మంత్రులు, వైసీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. 

big shock to jagan

జగన్ కు భారీ షాక్.. ఐదుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు జంప్!?

రాష్ట్రంలో  ఘోర పరాజయం పాలైనా.. సెంటర్ లో తమ బలం ఇంకా ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మా అవసరం ఉంది. రాజ్యసభలో మాకు బలం ఉంది. కేంద్రం ఏ  బిల్లు పాస్ చేయాలన్నా మా మద్దతు అనివార్యం అంటూ విర్రవీగుతున్న జగన్ కు సొంత పార్టీ రాజ్యసభ సభ్యులే ఝలక్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు జగన్ కు జెల్ల కొట్టి బీజేపీలోకి దూకూయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు రాజ్యసభలో బలం ఉంది. చక్రం తిప్పడానికి మాకు అన్ని అవకాశాలూ ఉన్నాయంటూ చెప్పుకుంటున్న జగన్ కు ఆ బలం పోవడం ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే  , విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్రావు, అయోధ్యరామిరెడ్డిలు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లారంటున్నారు.   రానున్న రోజులలో వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగలడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లే జగన్ కు కళ్లూ, నోరు, చెవులూ మాదిరిగా వ్యవహరించిన ఎ2 విజయసాయి రెడ్డి నేతృత్వంలోనే ఓ ఐదుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధమైపోయిందం టున్నారు. కాగా వీరి చేరికను ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదనీ, అయితే ఒక వేళ వారికి బీజేపీలోకి ఎంట్రీ లేకపోయినా, జగన్ పార్టీకి దూరం జరిగి తమను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని వీరు స్పీకర్ ను కోరనున్నారని సమాచారం.   అయితే రాజ్యసభలో అవసరమైన బలం లేని బీజేపీ వీరి రాకను స్వాగతించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇందుకోసం బీజేపీ తెలుగుదేశం అధినేతను ఒప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందని రాజకీయవర్గాలలో చర్చ జోరుగా సాగుతోంది. ఒక సారి వైసీపీ నుంచి వలసలు మొదలైతే అది ఇక ఆగకుండా సాగుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే తాజా ఎన్నికలలో వైసీపీ నుంచి లోక్ సభకు ఎన్నికైన నలుగురిలో ఇద్దరు పక్క చూపులు చూస్తున్నారని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.   

బీజేపీ ప్రాపకం కోసం తెలుగుదేశం కూటమికి మద్దతు.. జగన్ దివాళాకోరుతనం!

ఎలాగోలా అధికారం దక్కించుకోవడం, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేసుకోవడం, ప్రత్యర్థులపై కక్ష సాధించడం, వారిని వేధింపులకు గురి చేయడం, వీలైతే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం, కస్టడీలో మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం తప్ప వైసీపీకి సిద్ధాంతం అంటూ ఉన్నట్లు కనిపించదు. 2019 ఎన్నికలకు ముందు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ  అధికారంలోకి వచ్చిన వైసీపీ అంతకు ముందు కూడా అంటే జగన్ తన కోసం తానే పెట్టుకున్న పార్టీగా తప్ప వైసీపీకి ఎలాంటి సిద్ధాంతం ఉన్నట్లు గోచరించదు. 2014 ఎన్నికలలో పరాజయం తరువాత జగన్ ఏదో విధంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో సెంటిమెంట్ అస్త్రాలన్నిటినీ వాడేశారు. తనపై కోడి కత్తి దాడి డ్రామా, సొంత బాబాయ్ హత్య కేసు, తల్లీ, చెల్లి ప్రచారం ఇలా ప్రతి అవకాశాన్నీ వాడుకుని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. సరే  రాష్ట్ర ముఖ్యంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత  జగన్ తన అధికారాన్నంతా ప్రత్యర్థులను వేధించడానికి, కక్ష సాధింపునకే వినియోగించారు. పాలన అంటే సంక్షేమం అంటూ బటన్ నొక్కడం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం మాత్రమే అన్నట్లుగా వ్యవహరించారు.   ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలలో పలుకుబడి, ఆదరణ లభించాలంటే విలువలు పాటించాలి.  కానీ జగన్ మాత్రం విలువలు అన్న మాటే మా పార్టీ డిక్షనరీలో లేదు అన్నట్లుగా వ్యవహరించారు.   ఫలితంగా  ఐదేళ్ల ముందు అధికారం కట్టబెట్టిన జనమే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి కనీసం ప్రతిపక్షంలో కూర్చునే అర్హత కూడా లేదని విస్పష్టంగా తీర్పు ఇచ్చారు. అయితే జగన్ మాత్రం ప్రజా తీర్పును ఆపహాస్యం చేస్తున్న చందంగా మాట్లాడుతున్నారు. నెపం ఈవీఎంల మీద నెట్టేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఈవీఎంలు ప్రజా తీర్పునకు అద్దం పడతాయనీ, ప్రతి ఓటరూ తన ఓటు ఎవరికి పడిందో వీవీపాట్ లో చూసుకోవచ్చని చెప్పిన జగన్.. ఓటమి తరువాత మాట మార్చేసి ప్రజలంతా తనకే ఓటేశారనీ, కానీ ఈవీఎంలను ట్యాంపర్ చేసి చంద్రబాబు మోసం చేశారన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు.  సరే అదలా ఉంచితే.. తన పార్టీకి సిద్ధాంతమనేదే లేదని జగన్ మరో సారి రుజువు చేశారు. నైతికంగా వైసీపీ దీవాళాకోరుతనానికి ఇంతకు మంది ఉదాహరణ అవసరం లేదన్నట్లుగా ఈయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఉంది. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. రాష్ట్రంలో జగన్ ను, జగన్ పార్టీనీ ఉనికిమాత్రంగా ఎన్నికల ఫలితాలు మార్చేశాయి. కేంద్రంలో ఉన్న అండతోనే ఈవీఎంలను మాయ చేసి చంద్రబాబు అదికారంలోకి వచ్చారని స్వయంగా జగన్ చెప్పారు. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చేయడానికి ఒక పక్క సంప్రదింపులు చేస్తూనే మరో పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కరుణాకటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం  కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు మద్దతు ఇవ్వడమంటే.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే అనడంలో సందేహం లేదు. అయినా జగన్ ఎన్డీయేకే మద్దతు ఇవ్వడానికే నిర్ణయించారు.   ఎన్డీయే కూటమి తరఫున ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఓం బిర్లాను బీజేపీ ప్రకటించింది.  కూటమిలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీ తెలుగుదేశం. అంటే కూటమి అభ్యర్థిగా ఓం బిర్లా తెలుగుదేశం ఆమోదించి, అంగీకరించిన అభ్యర్థే అవుతారు.  అలాంటి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడానికి నిర్ణయిం చుకుంది.  ఏపీలో  తెలుగుదేశంతో  పోరాడుతూ… ఢిల్లీలో అదే పార్టీ  కూటమి తరపున నిలబెట్టిన అభ్యర్థికి జగన్ మద్దతు ఇస్తున్నారు.  ఇంత కంటే దిగజారుడు తనం ఉంటుందా అని సొంత పార్టీలోనే జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉండి  అధ్వాన పాలన సాగించిన జగన్..   బీజేపీ ప్రాపకం కోసం సొంత పార్టీకి రాజకీయ సమాధి కట్టడానికి కూడా రెడీ అయిపోయారు.  

జ‌గ‌న్ కొత్త ప్లాన్‌.. ఛీకొడుతున్న జనం

అధికారంలో ఉన్న‌ప్పుడు అసెంబ్లీ సాంప్ర‌దాయాలు, నియ‌మాలు మ‌రిచి అధికార మ‌దంతో మాట్లాడిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇప్పుడు నియ‌మాలు గుర్తుకొస్తున్నాయి. అసెంబ్లీలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నియ‌మాలు పాటించాలంటూ దెయ్యాలు వేదాలు వల్లె వేసిన‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. తాను త‌ల‌చుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఉండ‌ద‌ని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుపై నోరుపారేసుకున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు మాత్రం నీతి సూత్రాలు చెబుతున్నారు. ఐదేళ్లు అసెంబ్లీ గౌరవం పోయేలా  ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్ర‌జ‌ల చేత ఛీ కొట్టించుకున్న జ‌గ‌న్‌, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కుటుంబం పై నిండుస‌భ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన నీచ‌మైన వ్యాఖ్యలు జ‌గ‌న్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. స‌భా నియ‌మాలు పాటించాలంటూ గొప్ప‌ గొప్ప మాట‌లు చెబుతూ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడికి  జగన్ ఓ లేఖ రాశారు. వైసీపీ   హ‌యాంలో అసెంబ్లీ జ‌రిగిన తీరు, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌వ‌ర్తించిన తీరు ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ప్యాలెస్ రాజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అవేమీ ప‌ట్ట‌వు. ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు, ప్ర‌జ‌ల ప‌ట్ల తాను అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ.. అవ‌న్నీ మ‌ర్చిపోయి గాంధీగారిలా ఒక‌చెంప కొడితే మ‌రో చెంప చూపాల‌ని అన్న‌ట్లుగా అధికార పార్టీ నేత‌ల‌ను జ‌గ‌న్ కోరుతుండ‌టం విడ్డూరం. ఏపీలో భారీ మెజార్టీతో  తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోని మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌ట్ల స‌భ‌ గౌర‌వ ప్ర‌దంగా వ్య‌వ‌హ‌రించింది. అసెంబ్లీ నిబంధ‌న‌ల ప్ర‌కారం  సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్ర‌కారం ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ కూట‌మి ప్ర‌భుత్వం జ‌గ‌న్ ప‌ట్ల మ‌ర్యాద‌పూర్వంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆయన కూడా సిగ్గుపడాల్సినంత ఉదారంగా వ్య‌వ‌హ‌రించి మంత్రుల త‌రువాత జగన్ కు ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌మాణ స్వీకారానికి ముందు అసెంబ్లీ హాల్‌లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి వెంట‌నే అసెంబ్లీ హాల్ నుంచి వెళ్లిపోయాడు. అసెంబ్లీలో జ‌గ‌న్ ప‌ట్ల కూట‌మి పార్టీ స‌భ్యులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌జ‌లు సైతం మెచ్చుకున్నారు. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యిన నాలుగు రోజుల త‌రువాత.. అసెంబ్లీలో మీరు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారంటూ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు లేఖ రాయ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. జగన్ తీరు పట్ల వెగటు పుట్టిస్తోంది. ఐదేళ్ల కాలంలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను క‌నీసం మ‌నుషుల్లా కూడా గౌర‌వించ‌కుండా కౌర‌వ స‌భ‌ను న‌డిపిన జ‌గ‌న్‌.. ఇప్పుడు మాత్రం అసెంబ్లీ నియ‌మాలు అంటూ కొత్త విష‌యాలు ప్ర‌స్తావించ‌డం వైసీపీ నాయ‌కుల‌కు కూడా  చిరాకు తెప్పిస్తోంది.   స్పీక‌ర్ కు జ‌గ‌న్ రాసిన లేఖను ఓసారి ప‌రిశీలిస్తే,  మంత్రుల  తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది అసెంబ్లీ రూల్స్ అంటూ కొత్త వాదాన్ని జ‌గ‌న్‌ తెర‌పైకి తెచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10శాతం సీట్లు వుండాలని ఎక్కడా లేదు,  పార్లమెంట్, ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదంటూ జగన్ లేఖ‌లో పేర్కొన్నాడు. కూటమి సభ్యులు, స్పీకర్ తనపై పై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలి అంటూ స్పీకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు బయటపడ్డాయి. అసెంబ్లీలో గొంతువిప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించగలం. వీటన్నిటినీ  దృష్టిలో పెట్టుకొని వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ స్పీక‌ర్ కు రాసిన లేఖ‌లో జ‌గ‌న్ రెడ్డి పేర్కొన్నాడు. జ‌గ‌న్ లేఖ‌లో పేర్కొన్న అంశాల‌నుచూసి వైసీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో క‌నీస మ‌ర్యాద‌లు పాటించ‌ని మ‌నం.. అధికారం కోల్పోయాక నియ‌మాలు పాటించాలంటూ స్పీక‌ర్ కు లేఖ రాయ‌డం సిగ్గుగా లేదా జ‌గ‌న‌న్నా అంటూ నివ్వెరపోతున్నారు . అయితే, ఇక్క‌డ ఓ విష‌యం తెలుసుకోవాలి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పీక‌ర్ కు రాసిన లేఖ వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  ఐదేళ్లు అధికారంలో కొన‌సాగిన జ‌గ‌న్‌.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు క‌నీస మ‌ర్యాద‌ కూడా ఇవ్వ‌లేదు. కానీ, వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే వ‌చ్చి.. ప్ర‌తిప‌క్ష హోదాకూడా ద‌క్క‌క‌పోయినా.. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు స‌రియైన గౌర‌వం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌గ‌న్ కు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. జ‌గ‌న్‌, వైసీపీ ఎమ్మెల్యేలప‌ట్ల చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తించిన తీరు చూసి ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్నారు. ఎప్పుడు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగినా వైసీపీ ఎమ్మెల్యేల‌ప‌ ట్ల స‌భ‌లో మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, వారు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు స‌భ‌లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. అదే జ‌రిగితే.. గ‌త ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ జ‌రిగిన తీరును.. ప్ర‌స్తుతం అసెంబ్లీ జ‌రిగే తీరును చూసి ప్ర‌జ‌ల్లో త‌మ‌ప‌ట్ల వ్య‌తిరేక భావం మరింత ఎక్కువ అవుతుందని జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు కనిపిస్తోంది. దీనికితోడు.. అసెంబ్లీకి వ‌చ్చే ఉద్దేశంలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి లేరని వైసీపీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. జ‌గ‌న్ తానంత‌ట‌ తానే అసెంబ్లీకి రాలేద‌ని ప్ర‌జ‌లు అనుకోకుండా.. ఆ నెపాన్ని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం, స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిపై నెట్టేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేసిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కేటీఆర్‌కి శవాలు కావలెను!

ప్రస్తుతం పెద్దగా పనేం లేదు కాబట్టి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శవాల కోసం అన్వేషిస్తున్నారు. ఎక్కడెక్కడ చావులు జరిగాయా, ఆ చావులను ప్రభుత్వం మీద నెట్టేసి శవరాజకీయం చేద్దామా అని తహతహలాడుతున్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేతులు ఎత్తేసి ఫామ్‌హౌస్‌లో ‘టానిక్’ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలలు కని, ఆ కలలన్నీ కల్లలైపోయిన కేటీఆర్ మాత్రం ఏం చేసయినా మళ్ళీ అధికారంలోకి రావాలని తంటాలు పడుతూ, అప్పుడప్పుడు ట్విట్టర్లోకి వచ్చి కామెంట్లు పోస్టు చేస్తూ అధికార పార్టీ మీద ‘పోరాటం’ చేస్తున్నారు. అధికార పార్టీని తిట్టడానికి ఏ సాకూ దొరక్కపోతే, చచ్చిన వాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, తన రాజకీయాల కోసం శవాలను ఉపయోగించుకుంటూ శవరాజకీయ దురంధరుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. గతంలో ఉద్యమకారుల శవాల మీద నడిచి అధికారాన్ని సంపాదించుకున్నారు కదా.. ఆ అలవాటు ఎక్కడకి పోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో ఎక్కడ, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో వేస్తూ కేటీఆర్ ఆత్మానందం పొందుతున్నారు. ఏ వృత్తిలో వున్న వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఆ ఫలానా వృత్తికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం పదిరోజుల నుంచే కేటీఆర్ ఈ రకం రచ్చ చేయడం ప్రారంభించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఇంత కొద్ది కాలంలో కాంగ్రెస్ పార్టీ అంత  దారుణాలు ఏం చేసింది? ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఏ వృత్తిలో వున్న వారికి అన్యాయం చేసింది? నిజానికి ఇప్పుడు ఏ వృత్తిలో వున్నవారు ఆత్మహత్య చేసుకున్నా, అది గత పదేళ్ళుగా అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ పార్టీనే కారణం అవుతుంది తప్ప... నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కారణం అవుతుంది?  సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు ఈమధ్యకాలంలో ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేటీఆర్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మరి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యేనే కదా.. మరి ఆయన అద్భుతమైన పరిపాలనలో వున్నప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదు కదా... కేసీఆర్ కుటుంబం మాటలు జనం నమ్మే రోజులు పోయాయి. ఇప్పటికైనా కేటీఆర్ ఈ శవాల వేట మానుకుంటే మంచిది.