BRS letter to Justice Narsimha Reddy

జస్టిస్ నర్సింహారెడ్డికి బిఆర్ఎస్ లేఖాస్త్రం 

విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. 2003లో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం పీజీసీఐఎల్ నిబంధనలకు లోబడి ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందే కానీ నష్టం జరగలేదని వివరించారు. నాడు ఉన్న చట్టాలకు, నిబంధనలకు లోబడే భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ముందుకు రావడంతో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక అంశంపై విచారణ జరిగినప్పుడు ఒప్పందాల్లో భాగస్వాములైన వారందరినీ విచారించాలన్నారు. కానీ కొంతమందిని మాత్రమే విచారించి మీడియా సమావేశంలో మాట్లాడటం బాధాకరమన్నారు. ఇలా చేయడం ద్వారా, తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్లే అవుతుందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరుతూ భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. తెలంగాణకు వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కెసీఆర్     కమిషన్ ను  సవాలు చేస్తూ  హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Nitish Kumar repeats special status demand for Bihar

మోడీ గొంతులో బీహారీ వెలక్కాయ!

గొంతులో వెలక్కాయ ఇరుక్కుపోతే ఎలా వుంటుందో ప్రాక్టికల్‌గా తెలియకపోవచ్చుగానీ, ఊహించగలం. గొంతులో ఇరుక్కున్న వెలక్కాయని మింగలేం, కక్కలేం. అది అలా గొంతుకు అడ్డంగా పడి వుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతులో కూడా వెలక్కాయ ఇరుక్కుంది. వెలక్కాయ అంటే, నిజం వెలక్కాయ అనుకునేరు. సింబాలిక్ వెలక్కాయ.. బీహారీ వెలక్కాయ.. ఆ బీహారీ వెలక్కాయ పేరు నితీష్ కుమార్. గతంలో చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కడ విరోధం ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఈయనేమో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఆయనేమో ఇవ్వనంటారు.. అక్కడ వీరిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ళపాటు కొనసాగాయి. ఆ తర్వాత తాజా ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. కలసి పోటీ చేశారు. ఏపీలో విజయం సాధించారు. కేంద్రంలో తక్కువ మెజారిటీ వచ్చిన బీజేపీకి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి మోడీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఏమీ లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం. ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కాదు.. ఏ రాష్ట్రానికీ ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు కూడా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు లేరు. అయితే, చంద్రబాబుతోపాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడటానికి నితీష్ కుమార్ మద్దతు కూడా కీలకమైనదే. అలాంటి మోడీ వీక్ పాయింట్‌ని పట్టుకున్న నితీష్ కుమార్ ఇప్పుడు బీహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని డిమాండ్ చేస్తున్నారు.  శనివారం నాడు జనతాదళ్ యునైటెడ్ జాతీయ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. బీహార్‌కి అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అది కుదరదంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి అని నితీష్ డిమాండ్ చేశారు. అది కూడా కుదరదు అని మోడీ అంటే, మీకు మద్దతు ఇవ్వడం కూడా కుదరదు అని నితీష్ కుమార్ చెబుతారు. దాంతో మోడీ ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే, నితీష్ కుమార్ డిమాండ్‌కి మోడీ ఎస్ చెప్పలేరు.. అలాగని నో అనలేరు. ఎస్ అంటే, దేశంలో అనేక రాష్ట్రాలు మాక్కూడా బీహార్‌కి ఇచ్చిన వరం కావాలని డిమాండ్ చేస్తాయి. నో అంటే, నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరిస్తానంటారు.. అందుకే ఇప్పుడు మోడీ గొంతులో నితీష్ కుమార్ వెలక్కాయగా మారారు.

Instead of the IPC

నూతన క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలి: పీయూసీఎల్

చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనే చెప్పే ప్రయత్నంలో బిజెపి ప్రభుత్వం తీరు ఉంది. తాతల కాలం నాటి చట్టాలకు కాలం చెల్లిందనే ప్రయత్నం చేస్తుంది.  భారతదేశంలో బ్రిటీష్ కాలం నాటి ఐపీసీ శిక్షాస్మృతిని తొలగించి, నూతన క్రిమినల్ చట్టాలను తీసుకురావాలని కేంద్రం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జులై 1 తర్వాత దేశంలో కొత్త చట్టాలు అమలు కానున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) అమలు కానున్నాయి.  అయితే, నూతన క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు లేఖ రాసింది. కొత్త చట్టాల తీరుతెన్నులు, కొత్త చట్టాల అసవరం, కొత్త చట్టాలు ప్రవేశపెట్టడానికి గల అవకాశాలు తదితర అంశాలపై ముందు జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పీయూసీఎల్ తన లేఖలో పేర్కొంది.  ఎంతో విస్తృతంగా చర్చించి ఈ చట్టాలను తీసుకువచ్చామని, సభలో చర్చల సందర్భంగా అనేకమంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశామని న్యాయ శాఖ మంత్రి ఇటీవల చెప్పారని... అయితే, విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఆ చట్టాలపై వివరణాత్మక చర్చ జరగలేదన్న విషయాన్ని ఎత్తిచూపుతోందని పీయూసీఎల్ తన లేఖలో ప్రస్తావించింది. పైగా, క్రిమినల్ న్యాయవాదులు, న్యాయ వ్యవస్థలు, న్యాయాధికారులు, సాధారణ పౌరుల నుంచి అభిప్రాయాలను స్వీకరించలేదన్న విషయం కూడా అర్థమవుతోందని పేర్కొంది

ysrcp leaders funny on pinnelli arrest

ఈ పాపిష్టి వైసీపీ వాళ్ళకి పౌరుషానికేం తక్కువ లేదు!

మాచర్లలో సుదీర్ఘకాలంగా అరాచకం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండ్రోజుల క్రితం అరెస్టు చేయడం, నెల్లూరు జైలుకు పంపించడం చకచకా జరిగిపోయాయి. మొన్నటి ఎలక్షన్ల పోలింగ్ సందర్బంగా ఈవీఎం ధ్వంసం చేసిన నేరం మీద ఆయన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఒక్క కేసు మీదే అరెస్టు జరిగింది. ఈ అయ్యగారు చేసిన నేరాలన్నిటి మీదా అరెస్టు చేయాలంటే, దాదాపు ఏ వందసార్లో అరెస్టు చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం ఈవీఎం ధ్వంసం చేసిన నేరం మీదే అరెస్టు చేశారు.  పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన తన సహజ లక్షణంగా మరోసారి ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆయన గారి తమ్ముడు సక్సెస్‌ఫుల్‌గా పారిపోగలిగాడుగానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పారిపోలేకపోయాడు. దాంతో ఇంట్లోనే వున్న బాత్రూమ్‌లో దాక్కున్నారు. బాత్రూమ్‌లో దాక్కున్నంత మాత్రాన పోలీసులేమీ చెవుల్లో పూలు పెట్టుకుని వెళ్ళిపోరు కదా. బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టినంత పనిచేసి పిన్నెల్లిని అరెస్టు చేశారు. ఆ సందర్భంలో ఇంట్లోంచి బయటకి తెచ్చినప్పుడు కూడా అక్కడ వున్న ఒక టీడీపీ కార్యకర్త మీద పిన్నెల్లి దాడి చేసి పొట్టలో గుభీగుభీమని గుద్దులు గుద్దాడు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా, ఆయన అరెస్టు అయ్యేంత తప్పు చేసినందుకు కాకుండా, తెలుగుదేశం కార్యకర్త అక్కడ వున్నాడని ఫీలైపోయి దాడి చేశారు. సరే, ఈ విషయంలో కూడా మరో కేసు నమోదైంది అది వేరే సంగతి. ఈ గోల ఇలా వుంటే, పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్తే, పిన్నెల్లి బాత్రూమ్‌లో దాక్కున్నాడని వచ్చిన వార్తలు చూసి వైసీపీ నాయకులు ఓలమ్మో తెగ ఫీలైపోయారు. వెంటనే స్టేట్‌మెంట్ల మీద స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. మా పిన్నెల్లి పిల్లిలాగా పిరికోడు కాదు.. పల్నాటి పులి అని చెప్పుకొచ్చారు. అయ్యా వైసీపీ నాయకులూ.... మీ పిన్నెల్లి పిల్లి కాకపోతే, గతంలో ఒకసారి హౌస్ అరెస్టులో వున్నప్పుడు పోలీసుల కళ్ళుగప్పి ఎందుకు తప్పించుకున్నారు? హైదరాబాద్‌కి ఎందుకు పారిపోయారు? వారాల తరబడి పోలీసులకు దొరక్కుండా దొంగా పోలీస్ ఆట ఎందుకు ఆడారు? పారిపోవడం అనే పాయింట్లో పిన్నెల్లికి కొండవీటి చాంతాడంత చరిత్ర వుంది. కాబట్టి, ఇప్పుడు కూడా తన చరిత్రకి అనుగుణంగానే బాత్రూమ్‌లో దాక్కున్నారు. మీ వైసీపీ నాయకులు చేసేవన్నీ తప్పులు.. దొరికపోతేమాత్రం మా అంత పవిత్రులు ఎవరూ లేరన్నట్టుగా బిల్డప్పులు.

chandrababu giving pension

స్వయంగా పెన్షన్ ఇవ్వనున్న చంద్రబాబు!

దేశ చరిత్రలో ఇంతవరకు జరగని సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎపిలో జులై 1న ల‌బ్దిదారుల‌కు పెన్షన్ పంపిణీకి ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేప‌థ్యంలో తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు, దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అవబోతోంది. పాత బకాయిలు అన్నీ కలిపి ఏడు వేల రూపాయల పెన్సన్ చంద్రబాబు అందించబోతున్నారు.  జూలై 1వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు... సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాల‌ని తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది.. ఈ మేరకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లయింది. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పైనే ఉండాల‌ని తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది.

ex mp ramesh rathod death

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా వున్నారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ దారిలోనే కన్నుమూశారు. రమేష్ పార్థివ శరీరాన్ని ఉట్నూర్‌కి తరలించారు. రమేష్ రాథోడ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1999లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రమేష్ రాథోడ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 తెలుగుదేశం పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. ఇటీవలి ఎన్నికలలో ఆయన బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికీ లభించలేదు.

On one side

ఓ వైపు కెసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు... మరో వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జంప్ 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు మూడు రోజుల పాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ సమావేశాల పునఃప్రారంభ వివరాలను, ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్  ఘోర పరాజయం చెందింది. గత సంవత్సరం నవంబర్ 30 వ తేదీన తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమయ్యారు. తుంటి ఎముక విరిగి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా తన రాజకీయ సమీకరణాల ప్రకారమే నడుచుకున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించడానికి వచ్చినప్పుడు కెటీఆర్, కవితలు తప్పించుకుని తిరిగారు. ఆ తర్వాతే కవిత లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కుని తీహార్ జైలు పాలయ్యారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అయితే కెసీఆర్ నివాసానికి వెళ్లి కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.  కేసీఆర్ ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసి 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి, అది ఆయనకు అగ్నిపరీక్ష అవుతుంది’’ అని హైదరాబాద్‌లోని సీనియర్ జర్నలిస్టు ఎస్‌కే జకీర్ అన్నారు.  మొదటి నుంచి కూడా అట్టడుగు స్థాయి నుంచి బలమైన పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించ లేదు. 2014లో అధికారంలోకి రాకముందు తెలంగాణ సెంటిమెంట్ కార్డు పనిచేసి, సరైన క్యాడర్ బేస్ లేకుండానే ఆయన, ఆయన పార్టీ పలు ఎన్నికల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రియాశీలక కమిటీలు, బలమైన స్థానిక నాయకులు లేకుండానే ఎమ్మెల్యేలను  ఏకైక ప్రతినిధులను చేశారు. వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. వారికి బీఆర్‌ఎస్‌తో ఎలాంటి భావోద్వేగ బంధం లేదు. వారు వెళ్లిపోతే పార్టీ మరింత సంక్షోభంలో పడిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలున్న సభలో బీఆర్‌ఎస్ 39 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, బీఆర్‌ఎస్‌ జీరోకి పడిపోయింది.      “పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ మరియు బిజెపిల మధ్య పోరు జరిగింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం సాధిస్తే   మోడీ వేవ్ పని చేయడంతో కేంద్రంలో బిజెపి సంకీర్ణం గెలిచింది. ఈ దశలో ప్రజలను  ఒప్పించి ప్రజాభిమానం  గెలవడం బీఆర్‌ఎస్‌కు చాలా కష్టం అని జకీర్ అన్నారు. గత 15 రోజుల నుంచి కెసీఆర్ కొనసాగిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు వైఫల్యం చెందాయి. ఓ వైపు కెసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతుంటే మరో వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు యాదయ్య, గూడె మహిపాల్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. ఆత్మీయ సమ్మేళనాలు కెసీఆర్ కు రివర్స్ కావడం చర్చనీయాంశమైంది.   

US Woman Removed From Flight For Misgendering Crew Member

మెంటల్ ఎయిర్‌లైన్స్!

అమెరికా విమానాల్లో పనిచేసేవాళ్ళు మరీ దుర్మార్గంగా వున్నారబ్బా.. అమెరికాలో వుండే జెన్నా అనే ఒక అమ్మాయి తన కొడుకుని తీసుకుని  శాన్‌ఫ్రాన్సిస్కో నించి ఆస్టిన్ వెళ్ళడానికి విమానం ఎక్కింది. విమానం ఎక్కిన సమయంలో అక్కడ వున్న స్టాఫ్ ఒకావిడ మన జెన్నాకి బోర్డింగ్ పాస్ ఇచ్చింది. బోర్డింగ్ పాస్ తీసుకున్న జెన్నా ‘థాంక్యూ మేడమ్’ అనాల్సింది పొరపాటుగా ‘థాంక్యూ సర్’ అంది. అంతే, బోర్డింగ్ పాస్ ఇచ్చిన సుందరాంగికి బోలెడంత కోపం పొడుచుకొచ్చేసింది. నన్నుసార్ అంటావా అని, జెన్నాని, ఆమె కొడుకుని విమానంలోంచి కిందకి దించేసింది. పాపం జెన్నా అక్కడే వున్న విమానం సిబ్బందికి తన గోడు వెళ్ళబోసుకుంది. పైన ఒక ‘సార్’ మమ్మల్ని విమానంలోచి కిందకి దించేశాడు. ఆయనకి మీరైనా చెప్పండి అని మొత్తుకుంది. దాంతో ఆ సిబ్బంది కూడా జెన్నా మీద సీరియస్ అయ్యారు. నిన్ను విమానంలోంచి దించేసింది అబ్బాయి కాదు.. అమ్మాయి అని చెప్పారు. మేడమ్ అనకుండా సార్ అంటే మేడమ్‌కి కోపం రాదా అని మన జెన్నా మీదే సీరియస్ అయ్యారు. దాంతో జెన్నా నాలుక్కరుచుకుంది.. పొరపాటున సార్ అన్నా.. అయాం వెరీ సారీ అన్నా వాళ్ళు వినలేదంట. చివరికి జెన్నాని ఎక్కించుకోకుండానే విమానం వెళ్ళిపోయిందట. ఇదెక్కడి వెరైటీ గొడవరా మావా...

Putin gifted to Kim uses South Korean parts

శత్రువుల కారులో కిమ్ కిలకిలలు!

దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు ఎప్పుడూ తిట్టుకుని, కొట్టుకుని చస్తుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. దక్షిణ కొరియా డెవలప్‌మెంట్‌లో ఎక్కడికో వెళ్ళిపోతే, ఉత్తర కొరియా నియంత కిమ్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుంది. కాకపోతే ఈ కిమ్ము... కిమ్మని ఊరుకోకుండా అణుబాంబులు తయారు చేసి పెట్టుకున్నాడు. అందుకే ఈయనంటే అందరికీ భయం. ఈమధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాకి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ కిమ్‌కి ఒక కారు గిఫ్టుగా తీసుకెళ్ళాడు. పుతినూ, కిమ్మూ కలిసి ఆ కారులో చిలక నవ్వులు నవ్వుకుంటూ కాసేపు షికారు కొట్టారు. ఇందులో వెరైటీ ఏముందని అనుకుంటున్నారా? నిజంగానే వెరైటీ మరి.. ఎందుకంటే, పుతిన్ గిఫ్టుగా ఇచ్చిన కారు దక్షిణ కొరియాలో తయారయింది. మామూలుగా దక్షిణ కొరియా కాకి ఉత్తర కొరియాలో వాలినా, ఉత్తర కొరియా కుక్క దక్షిణ కొరియాలోకి దూరినా కాల్చి చంపేస్తారు. అలాంటిది దక్షిణ కొరియాలో తయారైన కారు ఉత్తర కొరియాకి వెళ్ళడమేంటి.. పైగా ఆ కారుని కిమ్‌కి గిఫ్ట్.గా ఇవ్వడమేంటి? ఆ కారులో కిమ్ము, పుతినూ కిలకిలా నవ్వుకుంటూ ట్రావెల్ చేయడమేంటి... నిజంగా ఇది ఒక వింత సంఘటనే అని వరల్‌ వైడ్‌గా అనుకుంటున్నారు.

jagan thinks to go himalayas

జగన్ హిమాలయాలకు వెళ్తే...?!

ఆలస్యంగా తెలిస్తే తెలిసిందిగానీ, అద్భుతమైన విషయం తెలిసింది. లేటెస్ట్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత... ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్... తాను ఎందుకు ఓడిపోయానే అర్థం కావడం లేదని, తాను బటన్ల మీద బటన్లు నొక్కి డబ్బు పంచినవాళ్ళంతా తనకు ఓట్లు ప్లస్ ప్రేమ ఎందుకు పంచలేదో అర్థం కావడం లేదని చాలాసార్లు మొత్తుకుంటూనే వున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం బయటపడని సరికొత్త పాయింట్ రీసెంట్‌గా బయటికొచ్చింది. జగన్ తన సన్నిహితుల దగ్గర బాధపడిపోతూ, ‘‘ఫలితాలు చూశాక షాకయ్య... ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్స్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది’’ అన్నారట.  జగన్ భజన బ్యాచ్‌ని ఈ పాయింట్ మీద మాట్లాడమన్నామనుకోండి... జనరల్‌గా ఏం చెప్తారంటే, ‘‘మా జగనన్న హిమాలయాలకు వెళ్తే, హిమాలయాల రేంజే పెరిగిపోతుంది. హిమాలయాలు ఇంకా కూల్‌గా అయిపోతాయి. మా జగనన్న ‘స్వామి జగనానంద మహర్షి’గా మారిపోతారు. హిమాలయాల్లో వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు. హిమాలయాల్లో అద్భుతమైన ఆశ్రమాన్ని స్థాపిస్తారు. ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళిస్తారు. ప్రపంచం మొత్తాన్నీ తన తపశ్శక్తితో కాపాడుతూ వుంటారు. ఓ ఐదు లక్షల సంవత్సరాలు జీవించి, ఈ భూమ్మీదకి తాను వచ్చిన కార్యాన్ని నెరవేర్చి, ఆ తర్వాత బొందితోనే మోక్షాన్ని పొందుతారు. అవసరమైతే మరణాన్ని జయించి, హిమాలయాల్లోనే సెటిలైపోతారు’’. చాలా ఓవర్‌గా చెప్పినట్టు అనిపించినప్పటికీ, జగన్ భజన బ్యాచ్ ఆయన్ని ఈ రేంజ్‌లో ఆకాశంలోకి ఎత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు జగన్ హిమాలయాలకు వెళ్ళిపోతే అక్కడ నిజంగా ఏం జరుగుతోందో చూద్దాం.. జగన్ హిమాలయాలకు వెళ్ళగానే ఫస్టుఫస్టు చేసేది ఏంటంటే, అక్కడ మంచులో, గుహల్లో, ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న మునులు, మహర్షులు, యోగులు అందర్నీ అక్కడ నుంచి అర్జెంటుగా తరిమేస్తారు. ఎవరైనా ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే, వాళ్ళని జైల్లో వేసి కుళ్ళబొడిపిస్తారు. తర్వాత హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తుగా వున్న శిఖరం తలని నరికేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కడతారు. ఆ ప్యాలెస్‌లో ఫుల్లుగా ఏసీలు బిగిస్తారు. హిమాలయాల్లో ఒక్కో కొండ మీద ఒక్కో పార్టీ ఆఫీసు కడతారు. హిమాలయాలు మొత్తం కబ్జా చేసేస్తారు. పులివెందుల లుంగీ బ్యాచ్‌ని హిహాలయాల మీదకి ఎంటర్ చేసి, లోకల్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయేలా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్ళ కాలంలో ఎన్ని దారుణాలు చేశారో హిమాలయాల్లో కూడా అంతకంటే నాలుగు ఎక్కువ దారుణాలే చేస్తారు. హిమాలయాల అదృష్టం బాగుండి జగనన్న హిమాలయాలకు వెళ్ళలేదుగానీ, లేకపోతే... పాపం... హిమాలయాలు ఏమైపోయేవో! ఇదంతా కామెడీయే.. లైట్ తీసుకోండి... జగన్ హిమాలయాలకు వెళ్ళేది లేదు.. ఇవన్నీ జరిగేవీ కావు!

Maldives minister suspended for black magic on President Muizzu

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మూఢ నమ్మకాలు మండ!

మూఢ నమ్మకాలు అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచమంతా వుంటాయ్. మూఢ నమ్మకాలు కేవలం చదువుకోని వాళ్ళకే వుంటాయి అనుకోనక్కర్లేదు.. ఎంత చదువుకున్న వాళ్ళలో అయినా ఇవి ఏడుస్తాయ్.. ఎవరిదాకో ఎందుకూ.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకి కూడా బుర్రనిండా మూఢ నమ్మకాలే వున్నాయ్.  షమ్నాజ్ సలీం అనే ఆవిడ, ఆదం రమీజ్ అనే పెద్దాయన తన మీద చేతబడి చేశారని ప్రెసిడెంట్ ముయిజ్జుకి డౌటొచ్చిందంట. అంతే, వెంటనే వాళ్ళిద్దర్నీ అరెస్టు చేయండని ఆర్డర్ వేసేశాడు. రాజుగారు తలచుకుంటే దెబ్బలకి కొదువా.. ప్రెసిడెంట్ ఇలా ఆర్డర్ వేశాడో లేదో పోలీసులు ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి లోపలేశారు. అరెస్టు అయిన వీళ్ళిద్దరూ ఏ శ్మశానంలోనో చేతబడులు చేసుకుని బతికేవారు కాదు.. సాక్షాత్తూ మాల్దీవ్స్ దేశంలో మినిస్టర్లుగా వర్క్ చేస్తున్న పెద్దమనుషులే. మేమేంటి.. చేతబడి చేయించడమేంటి మొర్రో అని ఆ ఇద్దరు మినిస్టర్లూ ఎంత మొత్తుకున్నా పోలీసులు ఎంతమాత్రం పట్టించుకోకుండా ఇద్దర్నీ జైల్లో పారేశారు. పనిలోపనిగా వీళ్ళిద్దరి మినిస్టర్ పోస్టుల్ని కూడా పీకేశారు.

Is IAS Praveen Prakash VRS valid?

ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ విఆర్ఎస్ చెల్లుబాటు అవుతుందా? 

ఆంధ్ర ప్రదేశ్ లో ఐఏఎస్ ప్రవీణ్  ప్రకాశ్ వాలెంటరీ రిటైర్మెంట్ దరఖాస్తు వివాదానికి కేంద్రబిందువయ్యింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆర్‌ఎస్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవహరించిన తీరుపై జీఏడీ అధికారులే విస్తుపోతున్నారు.  సాధారణంగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తు సమర్పిస్తారు. కాబట్టి, ప్రవీణ్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ను కలిసి వీఆర్ఎస్ దరఖాస్తును ఆయనకు సమర్పించాలి. ఎందుకు పదవీ విరమణ చేస్తోందీ వివరించాలి. కానీ ప్రవీణ్ ప్రకాశ్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోనులో మెసేజ్ పెట్టారు. తన దరఖాస్తును కేవలం ఓ తెల్లకాగితంపై రాసి తపాలా పెట్టెలో వేసి వెళ్లిపోయారు. ఇది చూసి అవాక్కైన జీఏడీ అధికారులు సదరు కాగితాన్ని తిప్పికొట్టారు. దీంతో, దిగివచ్చిన ప్రవీణ్ ప్రకాశ్ తగిన ఫార్మాట్‌లో వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సంతకం చేయాల్సిన చోట డిజిటల్ సిగ్నేచర్ కాపీ పేస్ట్ చేసి సరిపుచ్చారు. దీంతో, ఇది చెల్లుబాటు అవుతుందా? కాదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.  ప్రవీణ్ ప్రకాశ్ గతంలోనూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సందర్భాల్లో ఆయన తీరుపై ప్రశ్నలు తలెత్తాయి. ఇక జగన్ హయాంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైనప్పుడు కూడా ఆయన టీచర్లను బెంబేలెత్తించారు. తాను ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలంటూ ఓ వీడియో కూడా ఇటీవల విడుదల చేశారు.

China Communist Party expels ex defence ministers

చైనా ముసలయ్యల అవినీతి!

చైనా వాళ్ళు మేం కమ్యునిస్టులం... అవినీతి, అక్రమాలు మాకు ఎంతమాత్రం తెలియవు అని డబ్బా కొట్టుకుంటూ వుంటారు. కానీ, అదంతా బుస్సే... అవినీతి విషయంలో మనోళ్ళకి తాతలు చైనాలో వున్నారు. మామూలు జనం, చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగుల దాకా ఎందుకుగానీ, చైనాలో పెద్ద పెద్ద మినిస్టర్లే అందరికంటే పెద్ద అవినీతిపరులు. దేశానికి రక్షణమంత్రులుగా పనిచేసిన ఇద్దరు పెద్దమనుషులు భారీగా అవినితి చేశారంట. కోట్లకు కోట్లు సంపాదించారంట. ఈ విషయాన్ని ఆ దేశం ప్రెసిడెంట్ జిన్‌పింగ్ లేటెస్ట్.గా కనిపెట్టారు. వాళ్ళిద్దర్నీ కమ్యునిస్టు పార్టీ నుంచి గెంటేశారు. అరెస్టు చేసి లోపలేశారు. అవినీతిపరులుగా తేలిన వాళ్ళిద్దరూ రక్షణమంత్రులుగా పనిచేయడం మాత్రమే కాదు.. ఆర్మీలో జనరల్ రేంజ్‌లో హోదాలు వెలగబెట్టారు. పైగా వీళ్లిద్దరూ  70 సంవత్సరాలు దాటిన ముసలయ్యలు. ఈ వయసులో కూడా అవినీతి చేసిన మీకు హేట్సాఫ్‌రా నాయనా. ఇంతకీ వాళ్ళ పేర్లేంటంటే.... ఆ.. ఏ చింగ్ చింగ్ అనో... పింగ్ పాంగ్‌ అనో వుంటుంది. నోరు తిరగని వాళ్ళ పేర్లతో మనకి అంత అవసరమా?

Former PCC President D. due to heart attack. Srinivas passes away...Funeral tomorrow

గుండెపోటుతో  మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కన్నుమూత...రేపు అంత్యక్రియలు 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.   హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహనికి పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరి…. రాజ్యసభ ఎంపీగా పని చేశారు.  హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహనికి పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.  రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.   కెసీఆర్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి   మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు. ఇక చిన్న కుమారుడు అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.    డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా, 2004-08 మధ్య కాలంలో ఉన్నతవిద్య, అర్బన్, లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్‌తో కలిసి కృషి చేశారు.  సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డీఎస్‌కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి.  2013- 15 వరకూ శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారీ ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.  తండ్రి దూరమవడంపై కుమారుడు అర్వింద్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. నాలోనే ఉంటావు’’ అని అర్వింద్ కన్నీరుమున్నీరయ్యారు.

అమెరికాలో అతి తెలివి ఇండియన్!

మహామహా మేధావులంతా మన ఇండియాలోనే పుడుతూ వుంటారు. ఆర్యన్ ఆనంద్ అనే కుర్ర మేధావి కూడా మన ఇండియాలోనే పుట్టాడు. చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చేరాడు. ఆ యూనివర్సిటీలో తండ్రి లేని వాళ్ళకి స్కాలప్‌షిప్ ఇస్తారని తెలుసుకున్నాడు. అంతే, మనోడి బుర్రలో పురుగు పుట్టింది. మా నాన్న కూడా నా చిన్నప్పుడే చనిపోయాడు.. నాకూ స్కాలర్‌షిప్ ఇవ్వండి అని యూనివర్సిటీ వాళ్ళని అడిగాడు. మీ నాన్న చచ్చిపోయాడని మాకేంటీ గ్యారెంటీ అని యూనివర్సిటీవాళ్ళు అడిగారు.  మా డాడీ డెత్ సర్టిఫికెట్ వుందిసార్ అని మనోడు సర్టిఫికెట్ చూపించాడు. దాంతో యూనివర్సిటీ వాళ్ళు కరిగిపోయి మనోడికి స్కాలర్ షిప్ ఇచ్చారు. అక్కడితో ఆగితే మనోడు ఇండియావాడు ఎందుకవుతాడు? నేను ఇంత తెలివైనోడిని అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నిజానికి మా నాన్న చచ్చిపోలేదు.. నేను తప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇచ్చి స్కాలర్‌షిప్ కొట్టేశా. నేను టెన్త్ క్లాస్ కూడా పాస్ అవలేదు.. డూప్లికేట్ సర్టిఫికెట్‌తోనే అమెరికా యూనివర్సిటీలో సీటు సంపాదించా.. నాలాగా తెలివిగా వుంటే జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని పోస్టు పెట్టాడు. ఇంకేముందీ.. ఈ పోస్టు యూనివర్సిటీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది. అంతే, మనోడిని అరెస్టు చేసి లోపలేశారు. మామూలుగా అయితే అమెరికా చట్టాల ప్రకారం ఈ తిక్కలోడికి ఇరవయ్యేళ్ళు శిక్ష పడే ఛాన్సుండేదంట.. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు అంత శిక్ష ఎందుకులే అని చెప్పి, యూనివర్సిటీ నుంచి డిబార్ చేసి, ఈ తెలివితక్కువోడిని ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారంట. ఓరి దరిద్రుడా.. నీ బుర్రతక్కువతనంతో ఇండియా పరువు తీశావు కదరా...

అలీ భాయ్.. టీడీపీ వైపు రాకు.. నీకోదణ్ణం!

అధికారంలో వుంటేనే ఎవరైనా దగ్గరుంటారు. లేకపోతే అలీ లాగా అవుతారు. కమెడియన్ అలీ మొన్నటి వరకూ జగన్ పార్టీలో నాయకుడిగా చెలామణీ అయ్యారు. ఈసారి ఎన్నికలలో అలీ పార్లమెంటుకో, అసెంబ్లీకో పోటీ చేసే అవకాశాలు వున్నాయని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, అలాంటి ప్రమాదమేమీ జరక్కుండానే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వైసీపీ అధికారంలో వున్నంతకాలం ఏదో ఒక బుడ్డి నామినేటెడ్ పోస్టు వెలగబెట్టిన అలీ, అడపాదడపా ఏదైనా మీటింగ్‌లో కనపడి నాలుగు జోకులు వేయడం, తెలుగుదేశం మీద రెండు కామెంట్లు చేయడం తప్ప ఆ పార్టీకి ఒరగబెట్టిందేమీ లేదు. అసలు అలీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడన్నది ఒక పజిల్ అయితే, ఏ పాయింట్ నచ్చి వైసీపీలో చేరాడా అన్నది మరో పజిల్. సరే, ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి, ఇక తనకు వర్కవుట్ అయ్యేదేమీ లేదు కాబట్టి అయ్యగారు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బయటపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేసి ‘‘వైసీపీకి టాటా.. బైబై.. ఇట్లు ఆలీ భాయ్’’ చెప్పారు. ఇక తనకి, రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదని, తాను కూడా ఇప్పుడు అందరిలాంటి ఓటర్నే అని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు ఒక వైపు గుడ్ బై చెప్పినట్టే చెప్పిన ఆయన, టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తనకు పరిచయం వున్న వారికి టచ్‌లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అలీ వుద్దేశాన్ని గమనించిన సదరు తెలుగుదేశీయులు అయ్యా.. నిన్ను మా పార్టీలో చేర్చుకునే అవకాశం ఎంతమాత్రం లేదని ముఖంమీదే చెప్పినట్టు సమాచారం. అలీ విడుదల చేసిన వీడియోలో తాను ఎవర్నీ విమర్శించలేదని చెప్పుకున్నారుగానీ, తెలుగుదేశం పార్టీ మీద బాగానే పంచ్‌లు వేశారు. అసలు వైసీపీ నుంచి వచ్చే శనిగ్రహాలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఉద్దేశం పార్టీ నాయకుడికి ఎంతమాత్రం లేదు. అందువల్ల అలీ లాంటి ఆటలో అరటిపళ్ళు తెలుగుదేశం పార్టీ జోలికి రాకుండా పని చూసుకుంటే బెటర్.

కేసీఆర్‌కి మరో రెండు షాకులు!

శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి డబుల్ షాకులు తగిలాయి. మొన్నటి వరకు కంఠంలో ప్రాణం వున్నంత వరకు కేసీఆర్‌తోనే వుంటానని కన్నీళ్ళు పెట్టుకుని మరీ చెప్పిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇప్పుడు బీఆర్‌ఎస్‌ని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ వెళ్ళి, కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు తీసుకున్న యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య పార్టీ మారడమే పెద్ద షాక్ అనుకుంటే, ఇంతలోనే మరో షాక్ తగిలింది. బతికితే బీఆర్ఎస్‌లోనే.. చస్తే బిఆర్‌ఎస్‌లోనే అని పెద్దపెద్దగా చెప్పే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి, కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మహిపాల్ రెడ్డి మీద మూడురోజుల క్రితం ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. 

అలీ భాయ్.. జగన్ పార్టీకి గుడ్ బాయ్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కమెడియన్ అలీ రాజీనామా చేశారు. గత కొన్నేళ్ళుగా ఆయన వైసీపీలో వున్నారు. ఆ పార్టీ కోసం తన సన్నిహితుడు పవన్ కళ్యాణ్‌కి కూడా దూరమయ్యారు. నిన్నటి ఎన్నికలలో పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోయినా, ఏదో తూతూమంత్రంగా ప్రచారం చేశారు. ఎంపీగానో, ఎమ్మెల్యేగానో అలీ పోటీ చేసే అవకాశం వుందని మొదట్లో వార్తలు వచ్చినా, అది జరగలేదు.  ఏపీలో వైసీపీ దుకాణం సర్దేసిన నేపథ్యంలో అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేశారు. తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు. ‘‘నిర్మాత డి.రామానాయుడు గారి కోసం తెలుగుదేశం హయాంలో 1999లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత పార్టీ మారాను. నేను రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. పదిమందికీ సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం నేను ఏ పార్టీకి చెందిన మనిషిని కాదు’’ అని ఆ వీడియోలో చెప్పారు.