గవర్నర్ తో టచ్ లో ఉన్న హోమ్ మంత్రి అమిత్ షా
* నిమ్మగడ్డ నిర్ణయానికి ముందే , హోమ్ మంత్రిత్వ శాఖ కు అన్ని విషయాలు తెలుసు .....
* ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషనర్ కు చీఫ్ సెక్రెటరీ లేఖ
* సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం
* గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ తర్వాత , రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించే అవకాశం
రా ష్ట్రం లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్వవస్థ, న్యాయ వ్యవస్థ ల మధ్య అసలే మాత్రం కో-ఆర్డినేషన్ లేకపోవటం, పర్యవసానం గా ఎదురవుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి ఎకంగాఎన్నిక కమిషనర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ, ఈ రాష్ట్రానికి సి ఎం తానా, లేక రమేష్ కుమారా అని ప్రశ్నించటం ద్వారా రాజ్యాంగ వ్యవస్థ లకు సవాల్ విసిరారు. హై కోర్టులో తరచూ మొట్టికాయలు పడటం తో ఇప్పటికే అసహనం గాఉన్న సి ఎం జగన్ మోహన్ రెడీ, ఈ వ్యవహారం లో మాత్రం సుప్రీం కోర్టును ఆశ్రయించటానికే నిర్ణయం తీసుకున్నారు. ఈ లోగ, నిన్న అర్ధ రాత్రి ఎన్నికల కమిషనర్ కు చీఫ్ సెక్రటరీ నీలం సహానీ లేఖ రాశారు.
రాష్ట్రం లో కరోనా ఎఫ్ఫెక్ట్ లేదని ..ఎన్నికలను ముందు నిర్ణయించిన తేదీలలోనే జరిగేలా చూడాలని ఆమె ఆలేఖ లో లేఖలో పేర్కొన్నారు.
నిన్న ఎన్నికల సంఘం విధించి వాయిదా ను ఎత్తివేయాలంటూ రమేష్ కి లేఖ రాసిన చీఫ్ సెక్రటరీ నీలం సహానీ. ఆలేఖలో ఆమె తమను ఎన్నికల సంఘం సంప్రదించలేదని, సంప్రదించి ఉంటె తాము వాస్తవ పరిస్థితిని వివరించేవారమని చెప్పుకొచ్చారు. . తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని లేఖలో పేర్కొన్న సీఎస్.. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని అన్నారు. కేవలం ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె అన్నారు. స్థానికంగా ఎవ్వరికీ కరోనా సొకలేదని.. రానున్న మూడు నాలుగు వారాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉండదని నీలం సాహ్ని పేర్కొన్నారు. నాలుగు వారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనా వేయలేమన్న సీఎస్.. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని వినతి చేసింది. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటోంది.
ఇదిలా ఉంటె, అసలు గడిచిన వారం రోజులుగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ , రాజ్ భవన్ తో సంప్రదింపులు జరపటం, అలాగే ఢిల్లీ నుంచి కొందరు పరిశీలకులు విజయవాడ వచ్చి పరిస్థిని సమీక్షించటం లాంటి అంశాలు ఏవీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి లో లేకపోవడం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్రం లోజరుగుతున పరిణామాలపై కేంద్రం సీరియస్ గాఉండటం వల్లనే, ఎన్నికల కమిషనర్ ఏంన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చుననే భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రమేష్ కుమార్ చేసిన తొందరపాటు చర్యల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్ళడానికి గ్రౌండ్ దొరికిందని, చీఫ్ సెక్రెటరీ, హెల్త్ సెక్రెటరీ లను సంప్రదించకుండా నేరుగా ఆయన ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రకటన చేయటం వల్ల ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు ముందు పెట్టాలని భావిస్తోందని తెలుస్తోంది. రమేష్ కుమార్ చర్య ఉద్దేశ పూర్వకం కాకపోయినప్పటికీ, దాని పరిణామాలు విపక్షాలకు ఆక్సిజన్ ఇచ్చినట్టు అయినదని భావనను అటు సీనియర్ ఐ ఏ ఎస్ లు, ఇటు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు.