జగన్ తరువాత గడ్కారీయేనా?
posted on Oct 31, 2012 8:00AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌జగన్మోహనరెడ్డి తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే కేసు భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీదేనని న్యాయశాఖ మేథావులు అభిప్రాయపడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్‌కార్నర్‌ను జగన్ మనీలాండ్రిరగ్ ఉదంతం కొంత దెబ్బతీసింది. అయితే రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన గుండెఆపరేషన్లు, ఫీజురియంబర్స్‌మెంట్ వంటి కొన్ని పనులు జగన్‌కు ప్లస్ అయి 2012 ఉప ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయి. అయితే హిందుత్వ నినాదం వెనుక నిలబడే బిజెపికి దేశవ్యాప్తంగా నిజాయితీ అన్న నమ్మకం గతంలో ఉండేది. ఆ నమ్మకం ఒక్కసారి అధికారంలోకి వచ్చాక చక్కెర కుంభకోణం వంటి వాటితో తుడిచిపెట్టుకుపోయింది. బిజెపిని జాతీయపార్టీగా మాత్రమే గుర్తిస్తున్న నేటి స్థితిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ ఉదంతం పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకోగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లుగా తాజాగా ముంబయిలోని 12 సంస్థలపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గడ్కరీ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలకు సంబంధించిన కీలకపత్రాలను ఐటీశాఖ స్వాధీనం చేసుకుంది. దీన్ని బట్టి జగన్ తీరును బయటపెట్టిన సిబిఐ తరహాలోనే గడ్కరీ కేసు కూడా సాగుతోందని తెలుస్తోంది. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం ఈ అవినీతిపై నిజాయితీగా విచారణ చేసి వాస్తవాలను వెల్లడిరచటం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్కరీ ఒక్క కేసు చాలు బిజెపిని చిత్తు చేయటానికి అని కాంగ్రెస్ పెద్దలు కొందరు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు గడ్కరీని నిందితునిగా నిలబెట్టి ఆ తరువాత జగన్‌తో పోల్చేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇదే కనుక జరిగితే కొంత వరకూ బిజెపి బలహీనపడి నిజాయితీ అన్న ముసుగును పూర్తిగా కోల్పోవచ్చని రాజకీయ మేథావులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో వైకాపా, కేంద్రస్థాయిలో బిజెపి రెండిరటినీ ప్రజల్లో చులకన చేయటం ద్వారా కాంగ్రెస్ విజయరధం ఎక్కే ఈ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.