షర్మిల పాదయాత్రకు బ్రేక్ : మోకాలికి ఆపరేషన్
posted on Dec 17, 2012 @ 11:43AM
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిలా చేస్తున్న పాద యాత్రకు మూడు వారాలు బ్రేక్ పడనుంది. మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె పాద యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాద యాత్ర చేస్తున్న సమయంలో తన వాహనం ఫై నుండి పడటంతో ఆమె మోకాలికి గాయం అయింది.
గత శని, ఆది వారాల్లో ఆమె పాద యాత్ర జరగలేదు. సోమ వారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,మోకాలి నొప్పి కారణంగా అది సాధ్య పడలేదు. దీనితో, వైద్యులు జరిపిన ఎమ్మార్ స్కాన్ లో గాయం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. మరో రెండు రోజుల్లో ఆమెకు వైద్యులు కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు తెలియచేశారు.
దీనితో, ఆమె పాద యాత్ర కు మూడు వారాలు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. షర్మిలా కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో గానీ, మరో ఆసుపత్రిలోగానీ ఆపరేషన్ చేయనున్నారు.