Read more!

జనసేనానిపై వైసీపీ నేతల విమర్శల దాడి

మీరు మా ఇప్పటం గ్రామస్థుల గడపలు కూల్చారు. నా గుండెల్లో గునపం దించారు.  ఇప్పటంలో కొట్టిన ప్రతి గడపా నా గుండెల మీద కొట్టినట్టే.  సజ్జలా.. మీకు చాలెంజ్ చేస్తున్నా.. 2024లో మీరెలా గెలుస్తారో చూస్తాం. వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీ పెద్దలకు, ప్రధానికి చెప్పి చేయను. నేనే చేస్తా. ఇది నా నేల.. నేను ఆంధ్రుణ్ణి. ఆంధ్రాలో పుట్టా. ఆంధ్రలోనే తేల్చుకుంటా.. వైసీపీ నేతల్లా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయం. బీజేపీ పెద్దలను అడగం. నా యుద్ధం నేను చేస్తా. పిచ్చిపిచ్చిగా వాగిన వారందరికీ అధికారంలోకి రాగానే బదులిస్తా. ఇసుక తవ్వకాల వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది’ ఇవీ ఇప్పటం గ్రామంలో జగన్ రెడ్డి సర్కార్ ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ఆర్థిక సాయం చేసిన సందర్భంగా వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.

అంతే.. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేశ్, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు ఒక్కసారిగా విరుచుకుపడిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వకుండా చేస్తానన్న పవన్ ఛాలెంజ్ పై టూరిజం మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘మీడియావాళ్లకు చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి చెబుతున్నాను. ఆయన వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్లకూ చెబుతున్నాను. జగన్ గారిని కాదు కదా.. ఆయన ఎడమకాలిపై ఉన్న వెంట్రుకలు కూడా వీళ్లు పీకలేరు’ అంటూ రోజా నోటికి పదునుపెట్టారు. ‘ఇప్పటంలో తప్పు ఏదీ జరగలేదని హైకోర్టు లాగిపెట్టి లెంపకాయ కొట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన బుద్ధి మార్చుకోకపోతే ఎలా? ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాస్తవాన్ని హైకోర్టు కూడా అర్థం చేసుకుని ఇప్పటం గ్రామస్థులకు ఫైన్ వేసింది. దీన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలి’ అని రోజా సూచించారు. అక్కడితో ఆగని రోజా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు పైన, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పైన కూడా విమర్శలు గుప్పించారు.

‘ఇప్పటంలో సమస్యకు చంద్రబాబే కారణం. అక్కడ సమస్య వస్తే చంద్రబాబో లేక లోకేశ్ వెళ్లాలి. ’కానీ, ఇప్పటానికి పవన్ ను పంపించి, జగన్ ను తిట్టించడం ఏంటి? పవన్ ను చంద్రబాబు వాడుకుని ఫూల్ ని చేస్తున్నారు. పవన్ ఉనికి కోసమే ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది’ అంటూ దుయ్యబట్టారు. ‘పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో దింపాలి. అప్పుడే నువ్వు హీరోవి అవుతావు. రాజకీయాల్లో జీరో వేషాలు వేస్తే.. ప్రజలు నిన్ను హీరోను చేయరు. దమ్ముంటే ఒంటరిగా బరిలో దిగాలి’ అని పవన్  రోజా సవాల్ విసిరారు.

మంత్రి జోగి రమేశ్ కూడా పవన్ వ్యాఖ్యలకు రిటార్డ్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను రెడీ.. పవన్ సిద్ధమా? అన్ని పార్టీలూ కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేవు. పవన్ ది జనసేన కాదు.. సైకో సేన. ఈ సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొడుతుంటారు’ అంటూ రమేష్ విమర్శలు  గుప్పించారు. ‘నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థివా? నువ్వు సాయపడేది ఎవరికి? నువ్వు సాగిలపడేది ఎవరికి? నువ్వు తొత్తుగా మారేది ఎవరికి?.. చంద్రబాబుకే’ అంటూ జోగి  అన్నారు ‘2019లోనే పవన్ సత్తా ఏంటో అర్థమైంది. 2009లో అన్న స్థాపించిన ప్రజారాజ్యంలో ఏం చేశారో కూడా చూశాం. ఇప్పుడు పవన్ కొత్తగా ఇంకేం చేయగలరు? ఇప్పటంలో రోడ్లను విస్తరిస్తుంటే పవన్ కు అభ్యంతరం ఏంటి?’ అని మంత్రి బొత్స కూడా గతాన్ని వర్తమానాన్ని కలగలిపి విమర్శలు గుప్పించారు

పవన్ నాయుడు.. పవన్ నాయుడు.. అంటూ ప్రతిసారీ మీడియా ముందుకొచ్చి జనసేనానిపై విరుచుకుపడే  పేర్ని నాని  ‘జనసేనాని పవన్.. ఓ వారాంతపు నాయకుడు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకే.. జగన్ పట్ల పవన్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. పంటలు తగులబెట్టినప్పుడు, పొలాల్లో రోడ్లు వేసినప్పుడు పవన్ గుండెల్లో ఏం గుచ్చుకోలేదా? అప్పుడు తోలు మందమైందా? పవన్ వచ్చాడని ఇప్పటంలో ఏమైనా ఆగిందా? మోడీ కాళ్లు పట్టుకునేది, పారిపోయేది పవనే’ అంటూ