దుర్గగుడి ఇవో గా రావాలంటే 25 లక్షలు
posted on Oct 30, 2012 @ 12:16PM
అవును మీరు చదివింది కరెక్టే విజయవాడ కనక దుర్గఅమ్మవారి దేవస్ధానం ఇవోగా రావాలంటే ప్రస్తుతం అయితే 25 లక్షలు సదరు ప్రజాప్రతినిదికి ఇవ్వవలసేందేనని అధికారులు చెబుతున్నారు. దసరాకు ముందు ఈ కుర్చీఖరీదు 40 లక్షల పై మాటే. ఎందుకంటే ఈ పండగకు 5 కోట్లవరకు ఖర్చు చేస్తుంది. దాంతో కాంట్రాక్టర్లు అధికారుల మద్య పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఆరేటు ఫిక్స్ చేశారని చెబుతున్నారు. దుర్గగుడిని ఒక ప్రజాప్రతినిధి అనధికారికంగా శాసిస్తున్నారు. గుడిమీద ఏ చిన్న విషయమైనా ఆయన కనుసన్నలలో జరగాల్సిందే. ప్రస్తుత పరిస్దితుల్లో కొండ మీద ఏ అధికారి పనిచేయాలన్నా సదరు ప్రజాప్రతినిధి అడుగులకు మడుగులొత్తాల్సిందేర. అందుకే కార్యనిర్వాహణాధికారిగా ఎవరైనా రావాలనుకునే అధికారులు ఆయనద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. తనొక్కడికే డీల్ చాలదని మరో ప్రజాప్రతినిధిని కూడా ఆయన కలుపుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ శాఖామంత్రి కూడా ఆయన సన్నిహితులవడం వల్ల ఈ పదవి కోసం వీరి చుట్టూ తిరగవలసి వస్తుంది.దసరా ఉత్సవాలు ముగియంగానే ఇవో రఘునాద్ బదిలీ ఖాయమని అనుకున్నారు. వారి ప్రచారానికి తగ్గట్లుగానే ప్రొటోకాల్ పేరుతో వేటు పడిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. 2007 దసరా ఉత్సవాలలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భవానీ భక్తులు చనిపోయారు. అయినప్పటికీ ఇవో మీద చర్యలేమీ లేవు. కానీ ఇంచ్చార్జ్ మంత్రితోట నర్శింహం కు ప్రోటోకాల్ ప్రకారం ఆలయంపై స్వాగతం పలగక పోవడంతో వివాస్పదం అయి ఇవో రఘునాధ్ సస్పెండ్ కావాల్సి వచ్చింది.