వెంకటేష్ 'షాడో' టైటిల్ సాంగ్
posted on Mar 8, 2013 @ 11:22AM
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'షాడో'. ఈ సినిమా టైటిల్ సాంగ్ టిజర్ ను వి.వి. వినాయక్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం గురించి వెంకటేష్ మాట్లాడుతూ...ఆడియో ఫంక్షన్ ను మార్చి 15న చేస్తున్నామని, సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. 'షాడో' టైటిల్ సాంగ్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని అన్నారు. చిత్రంలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.
'షాడో'లో వెంకటేష్ తో పాటు శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ నటిస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.