మీడియా ముందు చేస్తేనే మజా! విజయ శాంతి
posted on Dec 18, 2012 @ 12:21PM
తే.ర.స.లో అప్పుడప్పుడు కనిపిస్తూ తళ్ళుకుమని మెరిసే విజయశాంతి మొన్న నల్గొండలోజరిగిన భారి తే.ర.స. బహిరంగసభకు మొహం చాటేయడంతో, మీడియా ఆమెకి కేసిర్కి మద్య విబేధాలే అందుకు కారణం అని కోడయికూయడమే గాకుండా ‘త్వరలో మీరు బిజెపిలో జేరబోతున్నారట కదా?’ అంటూ గాల్లోకి ఒక బాణంకూడా విసిరిచూసింది. దానితో కంగుతిన్న విజయశాంతి ఆ పుకార్లను గట్టిగా ఖండించేసి మళ్ళీ తే.ర.స. సభ్యులతో ఫోటోలు దిగుతూ మీడియాకి పోజులు ఇవ్వడం ప్రారంబించేరు. పనిలో పనిగా ఎక్కడోపాడయిపోయిన ఓ రైల్వే ట్రాకుని కూడా వెతికి పట్టుకొని ‘చూసారా...చూసారా... తెలంగాణాపట్ల చివరికి రైల్వేవాళ్ళు కూడా యెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో!’ అంటూ తానూ ఇంకా ఉద్యమంలోనే ఉన్నానని ప్రజలకి పత్రికముఖంగా మరో మారు తెలియజేసారు.
కేసిర్ తనని పార్లమెంటుకి వెంటరానిచ్చినా అఖిలపక్ష సమావేశాలకి తనని ఎలాగు వెంట తీసుకుపోడని తెలుసు గనుక అదేదో లైవ్ లో చూడగలిగితే బాగుంటుందని ఆలోచన రాగానే, అఖిలపక్ష సమావేశం మీడియా ముందు జరపాలని డిమాండ్ చేసారావిడ. మీడియా ముందయితే ఎవరెవరు ఏమేమి మాట్లాడారో లైవ్లో ప్రజలే చూస్తారు గాబట్టి, తెలంగాణాకి వ్యతిరేకులెవరో అనుకూలురెవరో తేలిపోతుంది అని ఆవిడ అభిప్రయపడారు. అయితే, అమూల్యమయిన ఆవిడ సూచనని కనీసం తే.ర.స. వర్గాలు సైతం పట్టించుకోలేదు పాపం.