టాలీవుడ్ హీరోతో హాసన్ అలీకి లింకులు
posted on Mar 28, 2011 @ 2:42PM
ముంబై: ఇటీవలే రాజకీయ నేతగా మారిన ఓ తెలుగు సినిమా టాప్ హీరోకు నల్లధనం కేసులో విచారణ ఎదుర్కొంటున్న హసన్ అలీకి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు నల్లధనం కేసులో హసన్ అలీకి కేరళ, ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు రాజకీయ నాయకులకు, సినీ రంగం వారితో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్లుగా అలీ ఈడీకి చెప్పినట్లుగా మెయిల్ టుడేలో వచ్చింది. ఆంధ్ర, కేరళనుండి నల్లధనం కుబేరులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పలువురికి తమ తమ నల్లధనాన్ని విదేశీ బ్యాంకులలో వేసేందుకు తాను సహకరించినట్లుగా చెప్పారు. హసన్ అలీతో ఓ మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకు సంబంధాలు ఉన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రముఖుల నల్లధనం మొత్తం 36వేల కోట్లు ఉన్నదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయా ధనాన్ని సినీరంగం కోసం, ఎన్నికలలో ప్రచారానికి ఉపయోగించినట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
రెండు ప్రాంతీయ పార్టీలకు హసన్ అలీ నల్లధనం సమకూర్చినట్లుగా తెలుస్తోంది. అలీ అంటేనే ఐటికి హడల్ అని తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌కు నల్లధనాన్ని భారీగా తరలించినట్లుగా తెలుస్తోంది. విదేశీ బ్యాంకులలో తన నల్లధనంతో పాటు సినీతారల, రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని విదేశీ బ్యాంకులలో పెట్టినట్టు ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. తన అకౌంట్‌లో ఓ మాజీ ముఖ్యమంత్రి నల్లధనం ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. నల్లధనం అకౌంట్లను తానే డీల్ చేసినట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల మంత్రులకు హసన్ అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. గత పదేళ్లలో ఎన్నికల కోసం రూ. 200 కోట్ల నల్లధానాన్ని అలీ సమకూర్చినట్లు మెయిల్ టుడే రాసింది. తమిళనాడు, కేరళ రాజకీయ నాయకులకు కూడా భారీగా అతను ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు రెంటికి ఎన్నికల కోసం నల్లధనాన్ని అలీ సమకూర్చి పెట్టినట్లు అలీ సమకూర్చినట్లు తెలుస్తోంది.