ప్రపంచ యుద్ధ మొదటి ఫొటోగ్రాఫర్
posted on Sep 3, 2020 @ 3:38PM
మేరీ ఆలివ్ ఎడిస్ (3 సెప్టెంబర్ 1876 - 28 డిసెంబర్ 1955)
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ఆధికారిక ఫొటోగ్రాఫర్ గా యుద్ధవాతావరణాన్ని, ప్రజాజీవనాన్ని కెమెరాలో బంధించిన వ్యక్తి మేరీ ఆలివ్ ఎడిస్. ఆమె తీసిన ఎన్నో ఫొటోలు ఆనాటి వాతావరణాన్ని, పరిస్థితులను చూసే వీలు కల్పిస్తున్నాయి. అంతేకాదు ఆమె తీసిన ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే కాకుండా ఆటోక్రోమ్ ఫొటోగ్రఫీ లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 1920లో కెనడా పర్యటనలో ఆమె తీసిన ఫొటోలు ఆ దేశం మొట్టమొదటి కలర్ ఫొటోలుగా ఛాయాగ్రహణ చరిత్రలో నిలిచిపోయాయి.
ఎడిస్ లండన్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ , ఆర్థర్ వెల్లెస్లీ ఎడిస్. లండన్ చర్చి స్ట్రీట్ లో ఆమె తన ఫస్ట్ ఫొటో స్టూడియోను ఏర్పాటుచేశారు. ఫొటోలు తీయడంలో ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక యుద్ధ ఫొటోగ్రాఫర్ గా ఎడిస్ ను నియమించారు. దాంతో అనేక యుద్ధ సమయంలో అనేక అంశాలను తన కెమెరాలో బంధించారు. బ్రిటిష్ ఉమెన్స్ సర్వీసెస్ సేవలను క్యాప్చర్ చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులను కూడా ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
లండన్ లో అనేక ఫొటో స్టూడియోలను ఏర్పాటుచేసిన ఆమె ఆటోక్రోమ్ పోర్ట్రెయిట్ లకు ప్రసిద్ధి చెందిన స్టూడియోలుగా వాటిని తీర్చిదిద్దారు. రాజవంశీకుల నుంచి అతి సామాన్యల వరకు ఎందరినో చిత్రాల్లో బంధించారు.
ప్రముఖ రచయితలు థామస్ హార్దీ, జార్డ్ బెర్నార్డ్ షా తదితరులను ఫస్ట్ ఫొటో తీసిన ఘనత ఆమెకే దక్కింది. 28 డిసెంబర్ 1955లో ఎడిస్ మరణించారు.
ఆమె తీసిన యుద్ధచిత్రాల్లో చాలా ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ఉన్నాయి. మరికొన్ని ఇతర చిత్రాలను సేకరించి ఆమె పేరుతో ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.