ప్రత్యేక తెలంగాణ వాదం మసకబారుతోందా
posted on Oct 30, 2012 @ 2:59PM
ప్రత్యేక తెలంగాణ వాదులకెవరికి మంత్రిపదవులు ఇవ్వకుండా ఉద్యమానికి దూరంగా ఉన్న వారికి అధిష్టానం మంత్రి పదవులివ్వడం ద్వారా తెలంగాణ పొంగు తగ్గించారు. ఎప్పుడూ తెలంగాణ గురించి మాట్లాడని ఈ ఇద్దరు మంత్రులు సర్వేసత్యన్నారాయణ, బలరాం నాయక్ ను ఇప్పుడు తెలంగాణ వాదులు, నాయకులు, టిజాక్ కోదండరాం ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించండని చెప్పటం ఎంత హాస్వాస్పదమో అని రాజకీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. సీమాంద్ర నాయకులు ప్రత్యేక తెలంగాణ అంశంపై వారి అభిప్రాయం చెప్పకుండా రావద్దని హుకుం చేసిన ప్రత్యేక తెలంగాణ వాదులు ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అనే సమాధానంతోనే ముందుకు సాగుతున్నా ఎదుర్కొనలేని పరిస్దితి.....వైకాపా అధినేత్రి విజయలక్ష్మీ పార్టీలోకి వలసలను కూడా ఆపలేక పోతున్నారు. ముఖ్యమంత్రి అదే జిల్లా అయిన మెదక్ లో పర్యటిస్తున్నారు. అంతకుముందు సిరిసిల్లా చేనేత కార్మికుల కోసం వైకాపా విజయలక్ష్మిన అడ్డుకున్న తెలంగాణ వాదులు శనివారం జరిగిన కార్యక్రమాన్ని అడ్డుకోలేక పోయారు. మొత్తానికి పైకి ఎంత పొంగుగా కనిపించినప్పటికీ 2014 నాటికి అది చాలా వరకు తగ్గుతుందనే అనుకుంటున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ ను వచ్చే ఎన్నికల వరకు నడిపించాలని తెలంగాణ నాయకులు, టి ఆర్ యస్ చంద్రశేఖర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో....