అదరగొట్టిన సన్నీలియోన్
posted on Jan 3, 2013 @ 4:53PM
బాలీవుడ్ నటి గా కూడా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కొత్త సంవత్సర వేడుకలలో అదరగోట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీ లో కుర్రకారుకు మత్తెక్కించేసింది. అనేక మంది బాలీవుడ్ నటీమణులు కొత్త సంవత్సర వేడుకలను సుదూర ప్రాంతాల్లో జరుపుకోగా, మరి కొంత మంది ఢిల్లీ రేప్ భాదితురాలి మృతికి సంతాపంగా అసలు ఈ వేడుకలకు దూరంగా ఉండగా, సన్నీ మాత్రం తన తొలి స్టేజ్ ప్రదర్శనను ఇచ్చింది.
ఢిల్లీ నగరంలోని లలితా హోటల్లో ఓ గంట ప్రదర్శన కోసం తాను తీసుకొన్న కోటి రూపాయలకు పూర్తి ‘న్యాయం’ చేసింది. గత డిసెంబర్ 31 అర్ధ రాత్రి ఆ హోటల్ లో ఆమె ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శనకు సుమారు మూడు వేల మంది కుర్ర కారు ఈలలు, చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఏ జిస్మ్ హైతో క్యా, డిస్కో దీవానే,అభీ...అభీ’ వంటి పాటలకు తన సన్నని నడుమును ఊపుతూ కుర్ర కారులో పూర్తి హుషారును నింపింది.
అంతే కాదు, అమెరికా పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఆల్బం లోని కొన్ని పాటలకు కూడా ఆమె నృత్యం చేసింది. సన్నీ చేసిన పాటలకు ప్రేక్షకులకు పిచ్చెక్కిపోయిందని ఆమె భర్త డేనియల్ వెబర్ ఆనందంతో చెప్పాడు. వారి రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, సన్నీ కార్యక్రమాన్ని వారు చాలా బాగా ఆనందించారని వెబర్ అన్నారు.
మరోవైపు ప్రేక్షకుల ప్రతిస్పందన తనకు బాగా నచ్చిందని సన్నీ అన్నారు.