ఆశావహులను జో కొడుతున్న సిఎం?
posted on Oct 31, 2012 @ 12:16PM
రాష్ట్రంలో మంత్రి పదవుల నియామకం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ నియామకం గురించి ఏ మాత్రం కంగారు పడటం లేదు. దీంతో ఇప్పటికే ఆరునెలలుగా ఎక్కువశాఖలు సిఎం చేతిలోనే నలిగిపోతున్నాయి. ప్రత్యేకించి సిఎం సంతకాలు చేసేందుకు కూడా ఖాళీ ఉండక కొన్ని పనులు ఆగిపోతున్నాయని పలువురు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో మంత్రి పదవి పొందవచ్చని ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఢల్లీ నుంచి వచ్చే సమాచారం కీలకం అన్న విషయం తెలిసిపోయింది. దీంతో ఢల్లీ కాంగ్రెస్ నేతలతో ఆశావహులు ఫోన్లు మాట్లాడుతున్నారు. తమపై ఒత్తిడి పెరుగుతున్నా అధిష్టానాన్ని ఒప్పించుకునేందుకు సిఎం ప్రయత్నించటం లేదని ఢల్లీ నేతలు కిరణ్‌పై కస్సుబుస్సులాడుతున్నారు. కిరణ్ పెద్దగా ఒత్తిడి చేయకపోవటం వల్లే అధిష్టానం అంతగా స్పందించలేదని కూడా ఢల్లీ నేతలు సిఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేకపోతే ఈపాటికి రాష్ట్ర మంత్రిపదవుల భర్తీ ఎప్పుడో పూర్తయి ఉండేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతీదానికీ చూద్దామని చెప్పే సిఎం ఢల్లీ నేతల ప్రచారం గురించి తెలుసుకుని నివ్వెరపోతున్నారు. కేంద్ర మంత్రి పదవులు పూర్తయ్యాయి కాబట్టి రాష్ట్ర మంత్రుల భర్తీ త్వరలోనే పూర్తి చేస్తామని మరోసారి ఆశావహులను ఆయన జో కొడుతున్నారు.