చిన్నారి పాప శాన్వీ దారుణ హత్య
posted on Oct 27, 2012 @ 11:42AM
ముద్దులొలికే చిన్నారి శాన్వికి ఈ ప్రపంచం రక్షణ కల్పించలేక పోయింది. తన ముగ్దంత్వంతో ఈ ప్రపంచాన్ని తాను జయించలేక శాశ్వతంగా నిష్క్రమించింది. క్రూరుల లోకంలో నేనుండ లేనంటూ సెలవు తీసుకుంది. అమానుషాన్ని అడ్డుకుంటానికి మన టెక్నాలజీ ఏ మాత్రం సహకరించలేకపోయింది. ఒకప్పుడు క్రూరులు సమాజానికి ఆవలి నుండేవారు. ఇప్పుడు మంచి వాడెవ్వరో క్రూరులెవ్వరూ తెలుసుకునేందుకు వీలు లేకుండా మనలోనే సాడిస్టులు ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటున్నారు. వారు సూటు బూటు వేసుకొని అత్యున్నతంగా చదువుకొని మనలో ఒకరిగా ఉంటూనే పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. సంస్కారం లేని చదువులతో మానవాళి మనుగడకు పెనుసవాలు విసురుతున్నారు. టెక్నాలజీ పెరిగి మానవత్యం తగ్గిందనటానికి ఇదొక ఉదాహరణ. అనుబంధాలు ఆప్యాయతలకు పుట్టిల్లయిన భారత దేశ పరువును దేశం కాని దేశంలో మట్టు పెట్టి దేశానికి తలవంపులు తెచ్చాడు కర్కొటకుడు రఘు. తెలుగు వారంత కలసి మెలసి ఐక్యతా రాగం తీసే కాలనీలోనే మానవత్వాన్ని పెకలించిన రాక్షసుడున్నాడని తెలిసిన తెలుగువారు వణికి పోతున్నారు. అలాంటి కపటులకు అమెరికన్ చట్టం కఠినమైన శిక్ష విధించి మరెప్పుడూ అలాంటి పాశవికత్యం రిపీట్ అవ్వకుండా బుజ్జి శాన్వికి, తన నానమ్మ ల ఆత్మలకు శాంతి చేకూరుస్తారని ఆశిద్దాం.