సెఫోరా కిడ్ సిండ్రోమ్.. పిల్లలపై దారుణమైన ప్రభావం చూపే ఈ సమస్య ఏంటంటే..!
posted on Aug 23, 2025 @ 9:30AM
టీవి షోలు, ప్రోగ్రామ్ లలో చిన్న పిల్లలు స్కిట్ లు వేస్తుంటారు. వీరికి పెద్దలతో సమానంగా మేకప్ వేయడం చూడవచ్చు. అలాగే పిల్లలు టీవీ సిరియల్స్ లో కూడా పిల్లలు అతిగా అలంకరించుకోవడం, పెద్ద మాటలు మట్లాడటం చేస్తుంటారు. ఇవన్న చూసి 10 నుండి 17 సంవత్సరాల పిల్లలు తాము కూడా వారిని అనుసరించడం మొదలు పెడతారు. ఇదంతా సెఫోరా కిడ్ సిండ్రోమ్ లో బాగం.
సెఫోరా కిడ్ సిండ్రోమ్ అంటే..
'సెఫోరా కిడ్' అనే పదం 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలకు మేకప్, బ్యూటీ ఉత్పత్తుల పట్ల పిచ్చి అని అర్థం. సెఫోరా వంటి బ్యూటీ స్టోర్ల ప్రభావంతో చిన్న వయస్సులోనే చర్మ సంరక్షణ, మేకప్, ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరించడం ప్రారంభిస్తారు. సోషల్ మీడియా, యూట్యూబ్, రియాలిటీ షోల నుండి బ్యూటీ టిప్స్ ను, ఫ్యాషన్ అనుసరణలను తీసుకొని వాటిని ఫాలో అవుతూ గ్లామరస్‌గా కనిపించాలని కోరుకుంటారు.
సెఫోరా కిడ్ సిండ్రోమ్ లో ఉండే తరం..
జెన్-ఆల్ఫా డేటా గురించి చెప్పాలంటే, సెఫోరా కిడ్స్ జెన్-ఆల్ఫాకు చెందినవారు. అంటే 2010 తర్వాత జన్మించిన పిల్లలు. ఈ పిల్లలు డిజిటల్ యుగంలో పెరిగారు. సోషల్ మీడియా ద్వారా ప్రభావితమవుతున్నారు. కాబట్టి వారికి అందం, ఫ్యాషన్ పట్ల ఆసక్తి చిన్న వయస్సులోనే పెరుగుతోంది. తల్లిదండ్రుల అనుమతి, ఆన్‌లైన్ ట్రెండ్‌లు, బ్రాండ్‌ల మార్కెటింగ్ ఈ ట్రెండ్‌కు ఆజ్యం పోస్తున్నాయి. దీనివల్ల మేకప్, చర్మ సంరక్షణపై అతిగా ఆసక్తి చూపుతుంటారు.
సెఫోరా కిడ్ సిండ్రోమ్ ప్రమాదమా..
సెఫోరా కిడ్ సిండ్రోమ్ పిల్లలకు మేకప్, ఖరీదైన యాంటీ-ఏజింగ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులంటే పిచ్చి. నిజానికి ఈ వయసు పిల్లలకు అవి నిజంగా అవసరం లేదు. మేకప్ ఉత్పత్తులు అన్నీ పెద్దల కోసం తయారు చేయబడతాయి. పిల్లల సున్నితమైన చర్మానికి అవన్నీ హానికరం. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి రెటినోల్, బలమైన ఆమ్లాలు వంటి రసాయనాల నుండి పిల్లలను దూరంగా ఉంచడం పెద్దల బాధ్యత.
మొదట పిల్లల వయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి అవగాహన కలిగించే విధంగా అర్థమయ్యేలా చెప్పాలి. చర్మ సంరక్షణ, మేకప్ ఉత్పత్తులు పెద్దల కోసం తయారు చేయబడతాయని, పిల్లల చర్మం సున్నితమైనదని చెప్పాలి. సోషల్ మీడియాలో కనిపించేది ఎప్పుడూ నిజం కాదని వివరించాలి. ఇలా చేస్తేనే పిల్లలను ఈ సెఫోరా కిడ్ సిండ్రోమ్ నుండి కాపాడుకోగలుగుతారు.
*రూపశ్రీ.