రాహుల్ స్ట్రాటజీ
posted on Oct 28, 2012 @ 4:29PM
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రుల్లో ఎక్కువ మంది వారసత్య రాజకీయాలనుండి వచ్చినవారే కనబడ్డారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాత వారికి పదవులు ఇవ్వకపోవడం పై రాహుల్ ఎదురయ్యే పరిస్దితులను ఏ మాత్రం లక్ష్య పెట్టటం లేదని తెలుస్తుందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ముందు సీనియర్లను శాంత పరచి తర్వాత పదవుల పంపకం జరిగితే బాగుండేదని సీనియర్ నాయకుల ఉవాచ.
అటు తెలంగాణ కు అనుకూలంగా గాని, ఇటు సమైఖ్యాంద్ర ఉద్యమ నాయకులను గాని రాహుల్ మంత్రి పదవిలోకి తీసుకొనే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. ఈ మద్యకాలంలో కావూరి సమైఖ్యాంద్రలో పాల్గొనడం వల్లే పదవి పొందలేకపోయారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.
విధేయత కంటే విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారని రాజకీయ వర్గాల బోగట్టా. స్వంత వ్యాపారాలకు కాకుండా పార్టీకి ఉపయోగ పడతారను కున్న వారికే పదవులు పంచారని చెబుతున్నారు. రాహుల్ ఆంద్రప్రదేశ్ రాజకీయాలకు ఎక్కువ ఫ్రాధాన్యత ఇచ్చినప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.