అందరూ కలిస్తేనే…
posted on Oct 31, 2012 8:42AM
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనతో అందరూ కలిస్తేనే తనకూ, పార్టీకి పట్టుగా ఉం టుందని, అప్పుడే పార్టీకి విలువ, గౌరవమని, లేకపోతే ఒక్కరే మిగులుతామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. నాయకులనే వారు ఒకరే ఉంటారని, సున్నాలు లేకపోతే అంకెకు విలువ ఉండదని, తనకు మరొకరు కలి స్తేనే తనకు విలువని, లేకపోతే ఒక్కడిగా మిగిలిపోతానని బొత్స నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా పార్టీకి బలం, అందం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావును తాను కలిసానని, 5 సార్లు ఎంపీగా గెలిచిన కావూరి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదన్నారు. కావూరి సేవలను పార్టీ మరోవిధంగా వినియో గించుకుంటుందని తాను భావిస్తున్నానన్నారు. కావూరి రాజీనామా ఉపసంహరించుకుంటారా అన్న ప్రశ్నకు తాను కోరానని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని బొత్స ఆశాభావం వ్యక్తంచేశారు. సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డికి ప్రమోషనా డిమోషనా అని విలేకరులు బొత్సతో ప్రస్తావించగా ఆయనకు శాఖలో సంబంధం లేదని, ఆయ న అనుభవజ్ఞుడని, ఏ శాఖ ఉన్నా అయనకు ఉన్న విలువ ఆయనకు ఉంటుందని బొత్స స్పష్టంచేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. రాష్ట్రంలో మంత్రివర్గంలో మార్పులపై అవసరమ నుకుంటే, అవసరమైతే..అన్న బొత్స, పార్టీలో అంతర్గ తంగా చర్చించుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటా మన్నారు.