కాగ్ నుంచి తప్పించుకుంటున్న ఆర్‌ఐఎల్? ఆయిల్ మంత్రిత్వశాఖను ముఖేష్ కొనేసారా?
posted on Nov 2, 2012 9:05AM
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునందుకున్న ధనవంతుల్లో ముఖేశ్ అంబానీ ఒకరు. ఆయన కంపెనీ ఆర్‌ఐఎల్‌తో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రెండో ఆడిట్‌లో భాగంగా జరగాల్సిన సమావేశం రద్దు అయింది. ఈ సమావేశం రద్దు చేస్తూ ఆయిల్ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. కాగ్‌తో సమావేశం కన్నా ముందే ఆర్‌ఐఎల్ ఆంక్షలు విధిస్తూ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నది. అంటే ఆర్‌ఐఎల్‌కు కాగ్‌తో సమావేశమయ్యే ఆసక్తి లేదన్న మాట. తన కంపెనీ అసలు విషయం బయటకు వస్తుందనే ముఖేశ్ ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని మార్పించిన విషయం అందరికీ తెలిసిందే.
దానితో ఆగకుండా కొత్త మంత్రితో చర్చించి కాగ్‌తో సమావేశాన్ని ఆపుజేయించారని తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. కేజీ డి`6 చమురు క్షేత్రంలో వ్యయాలతో పాటు దానితో ముడిపడి ఉన్న భిన్న వ్యవహారాలను వెలుగులోకి తెచ్చేందుకే కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కాగ్ నివేదిక కోరారు. ఈ నివేదిక కోరినందుకే ఆయన్ని శాఖ మార్పించిన ముఖేశ్ కాగ్‌తో సమావేశాన్ని ఆపుజేయించుకోవటం తన మనీపవర్ చాటినట్లుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నివేదిక విషయంలో ఆర్‌ఐఎల్ ఎంత ఆలస్యం చేస్తే అంతకాలం ఆర్‌ఐఎల్ తాజాపెట్టుబడులపై నిషేధం కొనసాగుతుంది. ఒకవైపు కాగ్ నుంచి తప్పించుకుంటూ క్రేజీవాల చేస్తున్న ఆరోపణలకు ముఖేశ్ బలాన్ని ఇస్తున్నారు.