Read more!

ఎప్పుడూ కూర్చుని వుంటే రిస్క్

 

 

 

 

నడుము పూసలు, డిస్కులు వయసుతోపాటు అరిగే అవకాసం ఉన్న మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సాద్యమైనంత ఎక్కువ కాలం వాయిదా వేయచ్చు. కూర్చునిచేసే శరీరానికి నష్టం ఏముంటుంది అనుకుంటాం కాని, ఎప్పుడు కూర్చుని ఉండే వాళ్ళకే డిస్కుల అరుగుదల ఎక్కువగా వుంటుంది అంటున్నారు నిపుణులు.

 

మన వెన్నుపూస డిస్కుల మిద భారం పడేది కూర్చుని ఉన్నపుడే  - నడక వల్లకాని, పనులవల్ల కాని సైక్లింగ్ వల్ల కాని డిస్కుల మీదభారం పడదు. ఎప్పుడు కూర్చుని ఉండడం వల్ల డిస్కుల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది .దీంతో ఆ డిస్కులు త్వరగా క్షీణించటం ప్రారంభిస్తాయట. అలా కాకుండదంటే  నడుముకు సంబందించిన వ్యాయామాలు తప్పక చేసి తీరాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు . వ్యాయామంవల్ల కండరాలు బలపడతాయి  - అప్పుడు అవి భారాన్ని పంచుకోగలుగుతాయి . దాని వలన  పూసలు, డిస్కులు  మీద ఒత్తిడి తగ్గుతుంది అందుకే ప్రాధమిక కదలికలు ఉండే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని హెచ్చరిస్తున్నారు  వైద్య నిపుణులు .

...రమ