Read more!

హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి..

హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకుని వాళ్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కోనసీమ జిల్లాకు చెందిన పందిరి వెంటక వీర్రాజుగా గుర్తించారు. యాంకర్ అనసూయ ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి అసభ్య క్యాప్షన్స్ పెడుతూ వేధింపులకు గురి చేయడంతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితంపైనా అభ్యంతరకర కామెంట్లు చేస్తుండటంతో కొద్ది కాలం కిందట అనసూయ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లు మారుస్తుండటంతో పందిరి వెంకట వీర్రాజు అంత తేలికగా దొరకలేదు. కోనసీమలోని అతడి స్వగ్రామం ట్రేస్ చేసి దాదాపు వారం రోజుల పాటు నిఘా వేసి ఎట్టకేలకు అతడిని  అరెస్టు చేశారు.

మార్ఫింగ్ ఫొటోలతో ఒక్క అనసూయనే కాకుండా అతడు కొందరు స్టార్ హీరోయిన్లు సహా మొత్తం 267 మంది హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ ట్విట్టర్ అక్కౌంట్ నుంచి అసభ్య వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లు పోలీసులు కనుగోన్నారు.