ఎంఐఎం నిర్ణయం హర్షణీయ౦: గాలి
posted on Nov 12, 2012 @ 3:49PM
టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, టీడీపీ, బీజేపీ తమను తీవ్ర ఇబ్బందులు పెట్టాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనడాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు నాయుడులు స్పందించారు. రాష్ట్రంలో మత సామరస్యం కాపాడింది తమ పార్టీనేనని, టీడీపీ హయాంలోనే హైదరాబాద్ లో అస్సలు మతకల్లోలాలు లేవని వారు అన్నారు.
మజ్లిస్ నేతలు కళాశాలలు పెట్టుకుంటే మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అని అన్నారు. మైనార్టీలకు రాష్ట్రవ్యాప్తంగా షాధీఖానాలు, సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ హయాంలోనే చేపట్టారని అన్నారు. ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం హర్షణీయమని, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ముస్లింలను మోసం చేసే పార్టీలేనని వారు అన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు ఉపసంహరణ వెనక ఉన్న ఉద్దేశ్యం నాలుగు రోజుల్లో బయటపడుతుందని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ వి. హనుమంతరావు అన్నారు. ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెసు అన్యాయం చేసిందని మజ్లీస్ నేత అసదుద్దీన్ అనడం సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు కూడా ఇవ్వని ప్రాధాన్యం మజ్లీస్‌కు ఇచ్చామని ఆయన చెప్పారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా ఈ విషయం చెప్తారని ఆయన అన్నారు.