ఆడవారి ఈ అలవాట్లు మగాళ్ల మనసును కొల్లగొడతాయట..!
posted on Sep 23, 2025 @ 12:04PM
ఆకర్షణ అనేది చాలా విచిత్రమైనది. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే.. మనుషులకు కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఏ పిచ్చి ఆకర్షణలకు లోను కాకుండా ఉంటారు. ఈ కాలంలో అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా తమకు ఎవరైనా నచ్చితే ఎదుటివారు కూడా తమను ఇష్టపడాలి అనుకుంటారు. ముఖ్యంగా ఏ అమ్మాయి అయినా తమకు నచ్చిన అబ్బాయిని అట్రాక్ట్ చేయాలనుకుంటే కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయి. వారు కొన్ని అలవాట్లను ఫాలో అయితే చాలు.. అలాంటి అమ్మాయిలను చూసి అబ్బాయిల మనసు ఫ్లాట్ అవుతుందట. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
స్వావలంబన..
నేటి ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. పురుషులు అలాంటి మహిళలను ఎంతో ఇష్టపడతారు. ఒక స్త్రీ తన సొంత నిర్ణయాలు తీసుకుని, స్వావలంబన కలిగి ఉన్నప్పుడు అది ఆమె వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.
సానుకూల ఆలోచన..
కష్ట సమయాల్లో కూడా సానుకూలంగా ఆలోచించే మహిళల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు. సానుకూల దృక్పథం ఉన్న మహిళలు ప్రతి పరిస్థితిని అవగాహనతో డీల్ చేస్తారు. అలాంటి మహిళలు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. కష్ట సమయాల్లో తమ భాగస్వాముల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
గౌరవం..
గౌరవం, ప్రేమ ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అట్లాగే ఇతరులను, ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలని కోరుకుంటాడు. ఒక స్త్రీ తన భాగస్వామి భావాలను, అభిప్రాయాలను గౌరవించినప్పుడు అది సంబంధం బలంగా మారడానికి దోహదమవుతుంది.
ఆనందం..
నేటి బిజీ జీవితాల్లో ఒక స్త్రీ చిన్న విషయాలలో ఆనందాన్ని అనుభూతి చెందితే.. అలాంటి మహిళలకు అబ్బాయిలు చాలా ఆకర్షితులు అవుతారు. చిన్న చిన్న విషయాలకే చిరాకు చూపే స్త్రీల వల్ల సంబంధాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది.
నిజాయితీ..
ప్రతి సంబంధంలోనూ నిజాయితీ చాలా కీలకం. ఒక స్త్రీ తన సంబంధంలో నిజాయితీగా ఉంటే, పురుషులు ఆమెను ఎంతో గౌరవిస్తారు. మహిళలలో ఉండే ఈ అలవాటు ఆమె పట్ల వారికి గౌరవాన్ని మరింత పెంచుతుంది.
సెల్ఫ్ లవ్..
పురుషులు తమను తాము ప్రేమించుకుంటూ తమ గురించి తాము శ్రద్ధ వహించే స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. తమను తాము గౌరవించుకునే స్త్రీలను ఇతరులు కూడా గౌరవిస్తారు.
పై అలవాట్లు అమ్మాయిలలో ఉంటే వారు అబ్బాయిలకు చాలా నచ్చుతారు. ఇలాంటి అమ్మాయిలు లైఫ్ ను చాలా బాగా లీడ్ చేయగలుగుతారు. పరిస్థితులను చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు.
*రూపశ్రీ.