ఆచార్యులవారికి సంకట స్థితి కల్పించిన కేసిఆర్
posted on Dec 18, 2012 @ 11:51AM
కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం, అన్నట్లుంది తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫసర్ కోదండరాంగారి పరిస్తితి ఇప్పుడు. నిన్న కెసిఆర్ పత్రికల వారితో మాట్లాడుతూ “నేను ప్రొఫసర్ కోదండరాం కలిసి డిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేశానికి వెళ్తున్నాము” అని ప్రకటించడంతో కొత్త కధ మొదలయింది.
తెలంగాణా జెఎసి చైర్మన్ గా వ్యహరిస్తున్నపటికీ ఆయన కేసిర్ వెనుకే తిరుగుతూ కేసిర్ తొత్తుగా తయారయడని నిత్యం విమర్శించే తెలుగుదేశం, బిజెపి పార్టీలు ఇప్పుడు కేసిర్ ప్రకటనతో ఒక్కసారిగా అతని మీద మళ్ళీ విరుచుకు పడ్డాయి. అసలు తెలంగాణా రాకుండా అడ్డుకొంటున్నది ప్రొఫసర్ కోదండరామేనని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు విమర్సించారు. కేసిర్ అనుచరుడిగా మారిన అయన ఏవిదంగా తెలంగాణా జెఎసి చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేసారు. కేసిర్ ప్రకటనతో సంకట స్థితిలోపడ్డ ఆచార్యులవారు అందరూ తనకే సుద్దులు చెప్పడం చూసి బాధపడుతూ “నేను తెలంగాణా జెఎసి సభ్యులతో చర్చిoచిన తరువాతే నా నిర్ణయం తెలియజేస్తాను’ అని పత్రికలద్వారా తన శత్రువులకి విన్నవించుకొన్నారు.
అయితే, కేసిర్ ప్రకటన కూడా చేసేసాక ఇప్పుడు అతని వెంట రానంటే, ఇప్పటికే తన మీద గుర్రుగా ఉన్న కేసిర్ తో మళ్ళీ మనస్పర్ధలు మొదలవుతాయేమోనని ఒక వైపు టెన్షన్ గా ఉంటె, మరో వైపు అతని వెంట వెళ్లి బిజేపి, తెలుగుదేశం పార్టీలకు మరింత అలుసయిపోతానేమోనని దిగులు పడుతున్నాడాయన.