కావూరి కాంగ్రెస్ కి దూరమైతే ఉత్తరాంధ్రలో పార్టీ అధోగతేనా?
posted on Dec 7, 2012 @ 11:54AM
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఇక కాంగ్రెస్ కు దూరం అయినట్లే అయన మాటలను బట్టి భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కు చేసిన సేవలు చాలని, ఇక పార్లమెంట్లో అడుగు పెట్టానని ఆయన స్పష్టంగానే ప్రకటించారు.
ఇప్పటికే తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తనకు స్వయంగా ఫోనే చేసి, ఎఫ్ డి ఐ ల ఫై ఓటింగ్ లో పాల్గొనాలని సూచించడంతో వచ్చానని, ఢిల్లీ లో ఉన్నప్పటికీ సోనియా గాంధీ ని కలిసే అవకాశం లేదని ఆయన అన్నారు.
తనకు పార్టీలో ఏ పదవీ అక్కర్లేదని కావూరి స్పష్టంగానే చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడితే, వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ నుండి పోటీ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లకు తగిన స్థానం లేదని ఆయన అన్నారు.
ఈ నెలాఖరులో కొల్లేరు సమస్య ఫై ఆందోళన చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. తన భవిష్యత్ కార్యచరణఫై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆయన అంటున్నప్పటికీ, ఈ ఆందోళన ద్వారా ప్రజల్లో ఉంటున్నట్లుగా సంకేతాలిస్తూ, మరో పార్టీలో చేరడానికి దీనిని వేదికగా ఉపయోగించుకోవాలనేది ఆయన ఆలోచనగా సమాచారం.