Read more!

వర్సిటీపేరు మార్చ‌డంలో ఆంత‌ర్య‌మదేనా?

ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి త‌న తండ్రి పేరు పెట్ట‌డం ప‌ట్ల యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు ఇప్ప‌టికే మండిప‌డు తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావ‌త్ దేశ‌మంత‌టా తెలుగు ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త వెల్లు వెత్తుతోం ది. అయినా వేరేవాళ్లు క‌ట్టిన‌దానికి త‌న తండ్రి పేరు మార్చాల‌న్న ఆలోచ‌న ఏమిట‌న్న అంద‌రి ప్ర‌శ్న‌. అయినా పేరు మార్చినంత మాత్రాన ఎవ‌రి ప్ర‌తిష్టా త‌రిగిపోద‌న్న అభ‌ప్రాయాలూ వ్య‌క్త‌మ‌వు తున్నాయి. 

అన్ని సమస్యలనుపక్కనపెట్టి, ఇదేదో ప్రజలకు ఎంతో కీలకమైన అంశమన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు; తిట్టుకొంటు న్నారు. ఎన్నికల సన్నాహాలలో వున్నాడు. ఏది చేసినాదూరమైన రాజకీయ ఆలోచనలతోనే చేస్తాడన్నది జగమెరిగిన సత్యం.  కానీ, ప్రసంగాలు కానీ, విమర్శలు కానీ, ఆ కోణంలో చూసినప్పుడు, విశ్వవిద్యాలయం పేరు మార్పు ద్వారా ఆయన సాధించ దలచిన రాజకీయ లక్ష్యం ఏమిటన్నది ప్రశ్న శాసనసభలో దీనిపై ఆయనిచ్చిన సుదీర్ఘ వివరణ అంత సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశాడు కాబట్టి, ఘనతదక్కవలసిన నేతకు ఘనతను ఆపాదించ డం కోసమేపేరు మార్పు అని వివరించారు ముఖ్యమంత్రి.

జగన్ ఇటీవల కొంతకాలంగా ఎన్నికల సన్నాహాలలో వున్నాడు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్నిఆ దిశ లోనే నడుపుతున్నాడు. శాసనసభ సమావేశాలలో కూడా వివిధ అంశాల మీద  ఆయన చేసిన  ప్రసంగా లన్నీ ప్రజలకు తాను చేసిన, చేస్తున్నమేలు జ్ఞాపకం చేసే ప్రయత్నంగానే కొనసాగాయి. 

అమరావతి రాజధాని కేవలం కమ్మ కులానికి మాత్రమే ఉపయోగం అన్న మాట పదే  పదే వల్లించారు. ఆయన ప్రసంగాల సారాంశం సమా జంలో ఒక వర్గం కావాలని పని గట్టుకొని తనమీద విద్వేషం పెంచు తున్నదన్న ఆరోపణ. ఈ కోణంలో నుంచి చూసిన ప్పుడు ఆరోగ్యవిశ్వవిద్యాల యానికి ఎన్టీఆర్ పేరు తొల గించి, వైఎస్ఆర్ పేరు పెట్టడంలో కూడా ఆ భావాల ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. ఎన్టీఆర్ అనేవాడు కమ్మకులానికి దేముడితో సమానం కాబట్టి, కీలెరిగి వాతపెట్టాలన్న రాజకీయ ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసు కొని వుండవచ్చు నని పరిశీలకుల అంచనా.

ఈ చర్య వల్ల సామాజిక వర్గాల పరంగాభావోద్వేగాలు చెలరేగి, తతిమా సామాజిక వర్గాలు తన పక్కన పటి ష్టంగా నిలబడుతాయ‌న్నది  వ్యూహం. దీని వెనుక దాగి వుండవచ్చు అన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల రాజకీయాలలో కులాల ప్రాధాన్యత,పాత్ర ఎంత కీలకమైనవో అందరికీ తెలిసిన సంగతే. మెజార్టీ కులా లను తన వైపు సమీకరించుకోవ డానికి ఒక వ్యూహం ప్రకారం రాజకీయ నిర్ణయాలు తీసుకొంటున్న ముఖ్య మంత్రి, ఎన్టీఆర్ పేరు మార్పుతో చాలా దూరాలోచన చేశాడని భావించవచ్చు.